Friday, April 26, 2024
- Advertisement -

ఏపీకి ప్రత్యేక హోద ఇవ్వ‌లేం: కేంద్రం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర‌త్యేక హోద గురించి ఏపీలో ఏ స్థాయిలో రాజ‌కీయం జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికీ ఈ అంశం రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌లేమని కేంద్రం కుండ బ‌ద్ద‌లు కొట్టేసింది. ఈ విష‌యాన్ని పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మ‌రోసారి వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా విష‌యంపై ప్ర‌శ్న‌లు అడిగారు. దీనికి కేంద్ర మంత్రి నిత్యానంద‌రాయ్ ససమాధానమిచ్చారు. 14వ ఆర్ధిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆయ‌న స్పష్టం చేశారు.

దీనిలో పాటు ఇదివ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉండి విభ‌జ‌న జ‌రిగి… రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణల మ‌ధ్య ఇప్ప‌టికీ అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని తెలిపారు. వీటిని ఆ రెండు రాష్ట్రాలు చ‌ర్చ‌లు జ‌రుపుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని మంత్రి నిత్యానంద రాయ్ సూచించారు. అలాగే, ఉమ్మ‌డి రాష్ట్ర విభజనకు సంబంధంచిన మ‌రికొన్ని హమీలు వివిద దశల్లో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

నిమ్మరసం, పసుపు కలిపి తాగితే.. లాభాలేంటో తెలుసా?

కేంద్రంపై కేటీఆర్ ఫైర్

ల‌క్ష‌లాది మందికి న్యాయ సాయం అందట్లేదు: సుప్రీం జడ్జి జస్టిస్​ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు మెట్లెక్కిన తెలుగు అకాడమీ అంశం

దూకుడు పెంచిన ప్రియమణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -