Friday, April 26, 2024
- Advertisement -

Munugode War: కాంగ్రెస్ దూకుడు.. మామూలుగా లేదుగా !

- Advertisement -

తెలంగాణలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికను అన్నీ రాజకియ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న మునుగోడు బైపోల్ లో సత్తా చాటలని టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఈ ఉప ఎన్నిక టి‌ఆర్‌ఎస్, బీజేపీ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం.. ఎందుకంటే మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం.. అంతే కాకుండా మునుగోడులో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడడంతో.. మునుగోడులో కాంగ్రెస్ ప్రభావం నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు కాంగ్రెస్ నేతలు.. ఇప్పటికే మునుగోడులో బహిరంగ సభలు, ప్రచారాలు నిర్వహిస్తూ.. నియోజిక వర్గ కార్యకర్తలలో ఉత్సాహం నిపుతున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగే నేత ఎవరు అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థుల విషయంలో టి‌ఆర్‌ఎస్ కాస్త తర్జనభర్జన పడుతుంటే, బీజేపీ తరుపున అధికారికంగా ప్రకటించకపోయిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థి ప్రకటన విషయంలో నిన్న మొన్నటి వరకు ఆచితూచి వ్యవహరించినప్పటికి.. తాజాగా అభ్యర్థి ప్రకటనను భాహిర్గతం చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

మునుగోడు నియోజికవర్గంలో ఉన్న గుర్తింపు దృష్ట్యా.. పాల్వాయి గోవర్ధన్ కుమార్తె పాల్వాయి స్రవంతికి మునుగోడు టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో కాంగ్రెస్ నుంచి బరిలో దిగే నేత ఎవరో తేలిపోయింది. అయితే ఇప్పటివరకు టి‌ఆర్‌ఎస్ గాని, బీజేపీ గాని మునుగోడులో పోటీ చేయబోయే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల కోడ్ రాకముందే అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇలా ముందే అభ్యర్థిని ప్రకటించడానికి కూడా కారణం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముందే అభ్యర్థిని ప్రకటించడం వల్ల పార్టీలో ఏర్పడ్డ అనిశ్చితి తొలగిపోయి.. కార్యకర్తలు ఏకీకృతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఎన్నికల బరిలో ఉత్సాహంగా దూసుకుపోయే విధంగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరి కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ ముందజ వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Also Read

గెట్ రెడీ.. నేషనల్ పార్టీ ఫిక్స్ ?

జగన్ మంత్రులకు పాఠాలు.. ఇలాగైతే కష్టమే !

టీడీపీ ఎన్డీయేలో చేరితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -