నాగబాబు అభిప్రాయాలతో మాకు లింక్ లేదు : పవన్ కల్యాణ్

- Advertisement -

జనసేన పార్టీలో లక్షల సంఖ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవని.. వాటితో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఇటీవలే సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టులతో కాక పుట్టిస్తున్నారు.

నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమమంలో నాగబాబు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని, వాటిని కూడా పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నామని పవన్ వెల్లడించారు. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

పార్టీపరమైన నిర్ణయాలు, అభిప్రాయాలను జనసేన అధికారిక పత్రం ద్వారా, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ జనసైనికులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రజాసేవ తప్ప మరో అంశం జోలికి వెళ్లొద్దని చెప్పారు. ఇక ఇటీవల నాగబాబు… గాంధీ, గాడ్సే వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -