Friday, April 19, 2024
- Advertisement -

దేవుడి సాక్షిగా.. అనపర్తిలో పొలిటికల్‌ టెన్షన్‌!

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటివరకు పరస్పర విమర్శలకే పరిమితమైన వైసీపి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు తాజాగా ప్రమాణాలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇరువురు నేతల మధ్య కొత్తగా గణపతి దేవుడు సాక్షి కాబోతున్నాడు. అనపర్తి ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు ఎక్కుపెడితే.. గణపతి దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తా. తానొక్కడినే కాదు.. తన కుటుంబంతో సహా ప్రమాణం చేస్తానని ఎమ్మెల్యే సవాల్‌ చేశారు.

వేదిక గణపతి దేవాలయం
నేతల ప్రమాణాలకు సంబంధించి బిక్కవోలు గణపతి ఆలయం వేదిక కాబోతోంది. బుధవారం (నేడు) మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రమాణాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో తాజా పొలిటికల్‌ టెన్షన్‌తో పోలీసులు అటెన్షన్‌లో ఉన్నారు. అవాంఛనీయ ఘటనలకు చోటుచేసుకుండా పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ 144 సెక్షన్‌ విధించారు. 336 మంది పోలీసులను గణపతి దేవాలయం ప్రాంతంలో మోహరించారు. వారిలో ఇద్దరు ఏసీపీ లు, నలుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్సై లు, 300 మంది పోలీసులు ఉన్నారు.

సై అంటే సై
అక్రమ గ్రావెల్‌ మైనింగ్‌ పర్మిషన్లు, నాటు సారా, పేకాట క్లబ్‌లు నడిపిస్తున్నారని, వాటిని సాక్షాలతో నిరూపిస్తానంటున్నారు నల్లమిల్లి. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదంటూ గణపతి ఆలయంలో భార్యతో సహా ప్రమాణానికి రెడీ అయ్యారు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. 144 సెక్షన్‌ ఉండటంతో గుడిలోకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇంతకూ ముందు చెప్పినట్టుగానే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అక్కడికి వస్తారా..? లేక ముందుగానే అరెస్టుల పర్వం ఏమైనా ఉంటుందా? ఇద్దరి ప్రమాణాల పరంపర ఎలా కొనసాగనుంది? అసలు అనపర్తిలో ఏం జరగనుంది? అని బిక్కవోలు ప్రజానీకం, ఆయా వర్గాల సానుభూతిపరులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -