Friday, April 19, 2024
- Advertisement -

ఒకే కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్

- Advertisement -

దేశంలోనే పురాతనమైన పార్టీ కాంగ్రెస్. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరుపొందిన హస్తం పార్టీ తన ఉనికి కోల్పోతోందా అన్న స్థితికి చేరుకుంది. గత ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ… తాము పాలిస్తున్న రాష్ట్రాలను సైతం ఒక్కొక్కటిగా కోల్పోతోంది. తాజాగా జరిగిన పంజాబ్ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. సీనీయర్లు, యువనేతలపై సమన్వయ లోపం. సరైన నాయకత్వ లోపం తదితర సమస్యలు కాంగ్రెస్ ను వెంటాడుతున్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం తేవడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఫోకస్ పెట్టారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన చింతన శిబిరంలో నవ సంకల్ప్ పేరుతో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యంగా ఒకే కుటుంబానికి ఒకే టికెట్, ఒకే వ్యక్తికి ఒకే పదవి అంశాలు కీలకం. దీంతో పాటు యాభై ఏళ్లలోపు వయసు వారికి పార్టీలో ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ కు ఆమోదం పలికిన సీడబ్ల్యూసీ.. మొత్తం 20 ప్రాతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఒకరు ఐదేళ్ల కంటే ఎక్కవ కాలం ఒకే పదవిలో కొనసాగకూడదు. పార్టీలో కొత్తగా మూడు విభాగాలు ఏర్పాటు కానున్నాయి. ప్రజా సమస్యల విభాగం, ఎన్నికల మేనేజ్ మెంట్, జాతీయ స్థాయిలో శిక్షణకు వేర్వేరు విభాగాలు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కు సహాయంగా కమిటీల ఏర్పాటు. పార్టీలో సంస్కరణల కోసం టాస్క్ ఫోర్స్. కాంగ్రెస్ లో యువతకు ప్రాతినిధ్యం పెంచాలని సీడబ్ల్యూసీ నిర్ణయం.

అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా

ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

అధికారంలోకి వస్తే కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -