Friday, May 10, 2024
- Advertisement -

టెన్స‌న్‌లో సీనియ‌ర్ నేత‌లు….

- Advertisement -

వైసీపీలో ప్ర‌శాంత్ కిషోర్ బాంబ్ అల‌జ‌డి రేపుతోంది. 2019 ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా జ‌గ‌న్ పీకెను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ముందుగా సొంత‌పార్టీపైనె దృష్టి సారించారు. ఎక్క‌డ త‌మ సీట్లు గ‌ల్లంత‌వుతాయోన‌ని భ‌యం ప‌ట్టుక‌క‌కుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయానేత‌లు,ఎమ్మెల్యేల బ‌లాల‌పై అంత‌ర్గ‌త స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు.

ఇప్ప‌టికే నాయేజ‌క వ‌ర్గాస్థాయిల్లో నాయ‌కులు భారీగా ఖ‌ర్చు పెడుతున్నారు. అయితే వీరంద‌రికి భ‌యం ప‌ట్టుకుంది. ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే ప్ర‌కార‌మే గెలుపు గుర్రాల‌కు టికెట్ల కేటాయిస్తాన‌ని చెప్పార‌నే వార్త‌లు క‌ల‌క‌లంరేపుతున్నాయి. తాజాగా పీకె టీమ్ శ్రీకాకులంజిల్లాలో ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన బృందం స‌ర్వే నిర్వ‌హించింది. నియేజ‌క వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌తోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల ప‌నితీరును గురించి కూడా ఆరాతీసిన‌ట్లు తెలుస్తోంది.

జిల్లా అధ్యురాలు రెడ్డిశాంతి స్థానంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు బాధ్య‌త‌లు ఇస్తె పార్టీ బ‌లోపేతం అవుంతుద‌ని కొంద‌రు చెప్పిన‌ట్లు స‌మాచారం. శ్రీకాకుళం, ఆముదాలవలస, టెక్కలి, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో పర్యటించి వివరాలు రాబట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ఇంకా ఎవరైనా సమర్ధవంతమైన నేతలున్నారా అని ఆరా తీశారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న సమన్వయకర్తలకు టిక్కెట్లు ఇస్తే టిడిపి అభ్యర్ధులను ఎదుర్కొని నిలవగలరా అనే అంశంపైనా దృష్టి సారించిందని అంటున్నారు.

రాజాం,పాల‌కొండ నియేజ‌క వ‌ర్గాల్లో వైసీపీకి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజాం ఎమ్మెల్యే పని తీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి కొండ్రు మురళికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎక్క‌డ త‌మ స్థానాలు క‌దులుతాయోన‌ని నేత‌ల్లో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -