Friday, May 10, 2024
- Advertisement -

సెంకండ‌రీ నాయ‌కుల‌పై ప్ర‌శాంత్ కిషోర్‌ దృష్టి… సీనియ‌ర్‌నేత‌ల్లో టెన్స‌న్‌…

- Advertisement -

2019 ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ సీనియ‌ర్ నేత‌ల‌కు భ‌యం ప‌ట్టుకుంది.దీనికి కార‌నం ఆ పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తాగా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించిన సంగ‌తి తెల‌సిందే.ఇన్నాల్లు తెర‌వెనుక ఉన్న పీకె….మొన్న జ‌రిగిన ప్లీన‌రి త‌ర్వాత ప్ర‌త్య‌క్ష కార్య‌రంగంలోకి దిగారు.గ్రామ స్థాయినుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు అభ్య‌ర్తుల బ‌లాల ,బ‌ల‌హీన‌త‌లు అంతేకాకుండా సెకండ‌రి నాయ‌కుల మీద కూడా దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.
తాజాగా గుంటూరు జిల్లాలో పీకె బృందం త‌న కార్య‌చ‌ర‌న‌ను మొద‌లు పెట్టింది.ప్లీన‌రీ విజ‌య‌వంతంతో ఖుషీగా ఉన్న నాయ‌కుల్లో ఇప్పుడు అల‌జ‌డి మొద‌ల‌య్యింది.రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ మండలాల వారీగా పర్యటించి నివేదికలు తయారు చేస్తోంది.
పీకే సైన్యం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మండలస్థాయిలో వైసీపీ ముఖ్య నాయకులతో విడివిడిగా చర్చలు సాగిస్తున్నారు.రాబోయె ఎన్నిక‌ల‌ను ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై చ‌ర్చిస్తున్నారు.అదే విధంగా ఇన్‌ఛార్జ్‌ల ప‌నితీరు ఎలా ఉంది..?అదే ప్రాంతంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు? వారెలా పనిచేస్తున్నారు? అనే విషయాలను పీకే బృందం అత్యంత గోప్యంగా సేకరిస్తున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో గడిచిన మూడేళ్లుగా నియోజక వర్గ ఇన్‌చార్జిలే అంతా తామై నడిపిస్తున్నారు. రెండేళ్లపాటు స్తబ్దుగానే ఉన్నా మూడో ఏట అడుగుపెట్టే సమయానికి వీరికి కొంత దైర్యం వచ్చింది.ఇప్పుడు ఉన్నట్లుండి పీకే బృందం మండల స్థాయిలో జల్లెడ పడుతుండడంతో పలువురు వైసీపీ నాయకులకు ‘పీకే ఫీవర్’ పట్టుకుంది.
నరసరావుపేట లోక్ సభ స్థానానికి సంబంధించి అభిప్రాయాలను కోరగా అయోధ్య రామిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మేకపాటి రాజమోహన్‌రెడ్డి లేదా వైఎస్సార్‌ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు నాయకులు వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది.ప్ర‌శాంత్ కిషోర్ ఎఫెక్ట్ ముందు ముందు ఎలా ఉటుందో చూడాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -