Thursday, May 9, 2024
- Advertisement -

ప్రొద్దుటూరు నియోజ‌క వ‌ర్గంలో సైకిల్ పంక్చ‌ర్

- Advertisement -

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది టీడీపీ పార్టీలో వ‌స్తున్న విబేధాలు బాబును క‌ల‌వ‌ర పెడుతున్నాయి. ఫిరాయింపుల‌కు తెర‌లేపిన‌ప్ప‌టినుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నాయ‌కుల మ‌ధ్య ఆదిప‌త్య పోరు న‌డుస్తోంది. సొంత జిల్లా క‌డ‌ప‌లో జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌ని చూస్తున్న బాబుకి ఆ పార్టీలోని ఆధిప‌త్య పోరు చుక్క‌లు చూపిస్తోంది.

తాజాగా ప్రొద్దుటూరు నియోజక వ‌ర్గం టీడీపీలో వ‌ర్గ‌విబేధాలు, ఆధిప‌త్య పోరు కార‌నంగా సైకిల్ పంక్చ‌ర్ అయ్యింది. సైకిల్‌ను రిపేర్ చేసేందుకు బాబు రంగంలోకి దిగారు. ఈ నియోజ‌క వ‌ర్గంలో ఉప్పు నిప్పులా రగిలిపోతున్న ఎంపీ సీఎం రమేష్, మాజీఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరునేతలు బహిరంగంగా విమర్శించుకోవడం, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 22 మంది కౌన్సిలర్లు రాజీనామా వ్యవహారంపై సీరియస్ అయ్యారు.

పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై సీఎం చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందన్న చంద్రబాబు ఈనెల 6న ఇరు వర్గాలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఇన్నాల్లు వారి మ‌ధ్య‌నున్న విబేధాల‌పై నోరు మెద‌ప‌ని బాబు నియోజకవర్గ ఇంచార్జ్ వరదరాజుల రెడ్డి తీరును నిరసిస్తూ మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేయ‌డంటో పార్టీ అధినేత నాయ‌కుల‌పై క‌న్నెర్ర చేశారు.కౌన్సిలర్ల రాజీనామా వెనుక సీఎం రమేష్ హస్తం ఉందని వరదరాజుల రెడ్డి ఆరోపిస్తున్నారు. సీఎం రమేశ్‌ కుటుంబాన్ని ప్రొద్దుటూరు రాజకీయాల్లోని రానివ్వనని బహిరంగంగా వ్యాఖ్యలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వీరి మ‌ధ్య‌నున్న విబేధాల‌ను చ‌క్క‌దిద్దేంకు బాబు రంగంలోకి దిగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -