Thursday, May 2, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు ఎప్పుడూ దేవుడే… కానీ…?

- Advertisement -

నిన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ నాదేవుడు అన్న బండ్ల గ‌ణేష్ ఆ దేవునికి షాక్ ఇస్తూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప‌వ‌న్ అంతే ఎంత అభిమాన‌మో గ‌ణేష్‌కు చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే రాజ‌కీయాలు రాజ‌కీయాలే.. అభిమానం అభిమాన‌మే అంటున్నారు.

బండ్ల గణేష్ జనసేనలో చేరకపోవడానికి తగిన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. జనసేన నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. పవన్ నిరాకరించారని వార్తలొస్తున్నాయి. కేవలం అభిమానం ఆధారంగానే టికెట్ ఇవ్వడానికి జనసేనాని ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతోంది.

ఏపీ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో జనసేనతో పోలిస్తే.. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేది కాదనలేని వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో చేరితే.. ఆ పార్టీ ఓట్లతోపాటు, పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు కూడా తనకే పడతాయని బండ్ల గణేష్ భావించే అవకాశాలున్నాయి. పవన్ పరోక్ష మద్దతుతో తన రాజకీయ ఆకాంక్షలు నెరవేరతాయని ఆయన అనుకోని ఉండొచ్చు. అందుకే ఆయన జనసేనను కాదని కాంగ్రెస్‌లో చేరారని ప్రచారం జరుగుతోంది.

బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినా, ఆయనకు అన్ని పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. టీఆర్‌ఎస్‌లో సన్నిహితులున్నారు.. టీడీపీలోనూ స్నేహితులున్నారు.. జనసేన సంగతి సరే సరి. మొన్నీమధ్యనే బండ్ల గణేష్‌, టీడీపీ ఎంపీ (రాజ్యసభ) సీఎం రమేష్‌, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసమంటూ నిరాహార దీక్ష చేస్తే, ఆ దీక్షా శిబిరంలో హల్‌చల్‌ చేసిన సంగతి తెల్సిందే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన మాజీమంత్రి బొత్స సత్యనారాయణ, బండ్ల గణేష్‌కి అత్యంత సన్నిహితుడు. ఇలా అన్ని పార్టీల‌తో మంచి సంబంధాలున్నాయి.

టీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ బండ్ల గణేష్‌, అత్యంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ పార్టీ కండువా క‌ప్పుకున్నారే మ‌రో వాద‌న వినిపిస్తోంది. నిజానికి టీడీపీ నుంచి పోటీ చేయాలనుకున్నా, తెలంగాణలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్‌నే ఆయన బెస్ట్‌ ఆప్షన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -