Thursday, May 2, 2024
- Advertisement -

బాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహానాడు సభికులు

- Advertisement -

అధికారంలో ఉన్న పార్టీతో అవసరాలు ఉంటాయేమో అన్న శంక కూడా పెట్టుకోలేదు. 2019లో మళ్ళీ అధికారంలోకి వస్తాడేమోనన్న భయం కూడా లేకుండా పోయింది. సీనియర్ మోస్ట్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబుకు మహానాడు సాక్షిగా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు సభికులు. ఇక చాలా మంది టిడిపి స్థానిక నాయకులు అందరూ కూడా అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళయినా మాకోసం చేసింది ఏమీ లేదని అధినేతల మొహాల మీదనే అడిగేశారు. కేవలం కొంతమందికే దోచిపెట్టారని ఆరోపణలు చేశారు.

అన్నింటికీ మించి మొత్తం 30వేల మంది హాజరవుతారని అనుకుని ఏర్పాట్లు చేస్తే పట్టుమని పదివేల మంది కూడా హాజరు కాలేదు. అది కూడా చంద్రబాబు ప్రసంగించే సమయానికి ముందు దగ్గరలో ఉన్న ఏరియాల నుంచి జనాలను తరలించాల్సి వచ్చింది. ఇక చంద్రబాబు ప్రసంగం మొదలెట్టగానే అందరూ కూడా భోజనాల గురించి ఆరాలు తీశారు. ఆ దెబ్బతో 11.30 గంటలకే భోజనశాలలు తెరిచారు. ఈ విషయాన్ని స్వయానా ఆంద్రజ్యోతినే అదేదో గొప్ప అన్నట్టుగా రాసింది. కానీ హాజరైన వారందరూ కూడా బాబు ప్రసంగం కొనసాగుతుండగానే భోజనశాలల దగ్గర గొడవ గొడవ చేయడంతో మహానాడులో రచ్చ అవుతుందేమో అన్న భయంతో చాలా ముందుగానే భోజన శాలలు తెరిచారు. ఆ వెంటనే ఎక్కువ మంది భోజనాల దగ్గరకు వెళ్ళారు. భోజనాల విషయంలో మాత్రం అందరూ మెచ్చుకున్నారు. అయితే భోజనాలు అయిన వెంటనే అందరూ కూడా అటు నుంచే అటే వెళ్ళిపోయారు. ఆ దెబ్బతో షాకవ్వడం టిడిపి నేతల వంతు అయింది. గంటలు గంటలు ప్రసంగాలు చేసే చంద్రబాబుకు ఏం చేయాలో కూడా పాలుపోక తన ప్రసంగానికి తొందరగానే ముగింపు పలకాల్సిన పరిస్థితి. ఆ తర్వాత మాత్రం టిడిపి నేతలకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకారట. మొదటి రోజునే ఇలా జరగడం ఏంటి? అధికారం అడ్డుపెట్టుకుని సంపాదించుకోవడానికేనా? పార్టీ కోసం కష్టపడలేరా అంటూ చీవాట్లు పెట్టారట. రెండో రోజు అయినా జాగ్రత్తగా ఉండాలని ….ఎన్నికల ఏడాది మహానాడు ఇది అని మర్చిపోతే ఎలా అని నాయకులను హెచ్చరించారట. మొత్తంగా చూస్తే సభికులు లేకపోవడం అన్న లోటును పక్కన పెడితే ఎసి ఎఫెక్ట్‌తో ఏర్పాట్లు, అదిరిపోయిన భోజనాలు అన్న మాటలు మాత్రం గట్టిగా వినిపించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -