Thursday, May 9, 2024
- Advertisement -

బాబు-ప‌వ‌న్ మ‌ధ్య దూరం పెంచేడానికి ఇదంతా జ‌రుగుతోందా…..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికలో ప‌వ‌న్ మ‌ద్ద‌తు కార‌నంగా కాపు,బ‌లిజ ఓట్లు టీడీపీ వైపేన‌ని చంద్ర‌బాబు పెట్టుకున్న ఆశ‌ల‌పై ప‌వ‌న్ నీల్లు చ‌ల్లారు. ఎన్నిక‌లో ఎవ‌రికి మ‌ద్ద‌తివ్వ‌కుండా త‌ట‌స్థంగా ఉంటామ‌ని ప్ర‌క‌టించి బాబుకి పెద్ద షాకే ఇచ్చాడు. అయితే దీని వెనుక పెద్ద క‌థే జ‌రిగింద‌ని టీడీపీ నేత‌లు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఏపీలో ఏపీలో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది భాజాపా. వ‌న్‌ను త‌మ వైపు లాక్కునేందుకు ప్ర‌ణాళిక‌లు కూడా వేసుకుంటోంది. చంద్ర‌బాబుకు చెక్ పెట్టేదానికి నంద్యాల ఉప ఎన్నిక‌నె వేదిక‌గా చేసుకుంటోంది. టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య గ్యాప్ రావ‌డానికి కార‌ణం.. ఇరు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ నిర్వ‌హించిన‌ ఎట్‌హోమ్. ఇందులో న‌ర‌సింహ‌న్‌-ప‌వ‌న్ భేటీతోనే మొత్తం సీన్ రివ‌ర్స్ అయిపోయింద‌ని పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో రాజ‌కీయాల‌పై చ‌ర్చించి…కేంద్ర పెద్ద‌ల అభిమ‌తాన్ని ప‌వ‌న్‌కు వివ‌రించారంట గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్‌. సీఎం చంద్రబాబుకు స‌న్నిహితంగా ఉంటున్న వారందరినీ కేంద్రం దూరంచేస్తూ …కొత్త మిత్రుల‌ను వెతుక్కుంటోంది. ఇటీవ‌ల వైసీపీతోనూ దోస్తీ బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలోనే 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇటు టీడీపీకి గుబ్‌బై చెప్పి.. వైసీపీతో ఎన్నిక‌లకు వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప‌వ‌న్‌కు వివ‌రించార‌ట‌.

ఇదే స‌మ‌యంలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌ట‌స్థంగా ఉండాల‌ని ప‌వ‌న్‌ను న‌ర‌సింహ‌న్ కోరార‌ని టీడీపీ నేత‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. నంద్యాలలో గణనీయంగా ఉన్న కాపు, బలిజ ఓట్లు టీడీపీకి రాకుండా చేయటమే దీని ఉద్దేశ‌మని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.మొత్తానికి బీజేపీ నేత‌ల మంత్రం ఫ‌లించింద‌నే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -