Tuesday, May 7, 2024
- Advertisement -

వైసీపీలోకి బాలకృష్ణ అత్యంత సన్నిహితుడు

- Advertisement -

టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో కదిరి బాబూరావు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కదిరి బాబూరావు ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. బాబూరావు వైయస్‌ఆర్‌సీపీలో చేరడంతో ప్రకాశం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జిల్లా నాయకులు పేర్కొన్నారు.

మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, నమ్మక ద్రోహం చేయడంలో చంద్రబాబు దిట్ట అని కదిరి బాబూరావు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతో వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని కదిరి బాబూరావు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి 34 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించానని, అలాంటి తననే చంద్రబాబు మోసం చేశాడని బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలకృష్ణతో ఉన్న స్నేహంతో ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్నానన్నారు. నందమూరి వారికి, నారా వారికి చాలా తేడా ఉందన్నారు. బాలకృష్ణ చెప్పిన మాటలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు లాంటి నమ్మక ద్రోహి దగ్గర ఇమడలేకపోయారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతో తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరానన్నారు.

అవసరాలకు రంగులు మార్చే ఊసరవెల్లి చంద్రబాబు: తోట త్రిమూర్తులు
చంద్రబాబు చేసే భయంకరమైన మోసాలు భరించలేక కదిరి బాబూరావు టీడీపీని వీడారని వైయస్‌ఆర్‌ సీపీ నేత తోట త్రిమూర్తులు అన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తే.. దాన్ని మళ్లీ ఎన్నికలు వచ్చాకే చంద్రబాబు బయటకు తీస్తాడన్నారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించే నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ తొమ్మిది నెలల కాలంలోనే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ పూర్తి చేసిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రం అంతా కులాలు, వర్గాలు, పార్టీలు తేడా లేకుండా.. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకుంటుందన్నారు. మాటకు కట్టుబడే వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అయితే.. అవసరాల కోసం రంగులు మార్చే ఊసరవెల్లి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో లోకల్‌ బాడీ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని సీట్లు వైయస్‌ఆర్‌ సీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -