Friday, April 26, 2024
- Advertisement -

పోలీసులపై రెచ్చిపోయిన మాజీ మంత్రి అఖిల ప్రియ…

- Advertisement -

పల్నాడులో మొదలైన రాజకీయ వేడి ఆత్మకూరుకు తాకేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోటాపోటీగా ప్రతిపక్ష టీడీపీ, అధికార వైఎస్సార్‌సీపీ ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో ఆయా పార్టీల నేతలును ఎక్కడి కక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదే సమయంలో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఓ హోటల్ ఉన్న ఆమెను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆమె సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి కూడా ఉన్నారు.మరోవైపు జగత్ విఖ్యాత్ రెడ్డి గదిని కూడా పోలీసులు సోదా చేశారు.

దీనిపై అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.హోటల్‌ నుంచి బయటకు వెళ్లేందుకు పర్మిషన్‌ లేదంటూ అఖిలప్రియకు పోలీసులు ఎంత నచ్చజెపప్పినా వినలేదు. తనను ఆపేందుకు హక్కెవరిచ్చారంటూ వారితో వాగ్వాదానికి దిగారు. తన అనుచరులతో కలిసి మహిళా ఎస్సైపై జులుం ప్రదర్శించారు. వారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా నేనె వరో తెలుసా అంటూ హెచ్చరించారు. ఛలో ఆత్మకూరుకు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగానే అఖిలప్రియను నిర్బంధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -