ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబాన్ని దూషించడాన్ని తప్పుబడుతూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య దంపతులు నిరసన దీక్షకు దిగారు. పోలీసులు తమను ఇంటి నుంచి బయటకు పోనివ్వడం లేదని, పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వస్తానన్నా పోలీసులు ససేమీరా అనడంతో వర్ల రామయ్య తన ఇంటి ఆవరనలోనే ఆయన తన భార్యతో కలిసి దీక్షకు దిగారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.

నటుడిగా న్టీఆర్ గొప్పవాడే కానీ.. ఒక మేనల్లుడిగా విఫలయ్యాడు. మేనత్తను అవమానించిన వారిని చీల్చి చెండాడే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ కు లేదా.. వంశీని, కొడాలి నానిని కంట్రోల్ చేయాల్సిన బాద్యత ఎన్టీఆర్ కు లేదా.. నీ సోంత మనుషులనే అవమానిస్తుంటే నువ్వేం చేస్తున్నావ్.. అదే హరికృష్ట బతికుంటే మరో సీతయ్యలా మరేవాడు. బాలకృష్ణ, కుటుంబ సభ్యులు మీడీయా ముందుకోచ్చారు… జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 75 ఏళ్ల ముసలి వాడిలా సుభాషితాలు చెబుతున్నాడు. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు మా వెంట ఉన్నవారినే మేం గుర్తిస్తాం అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు.

- Advertisement -

ఒక గౌరవ సభలో రాజకీయాలతో సంబంధంలేని మహిళను కించపరచడం ఏంటని ప్రశ్నించారు. భవనేశ్వరీ దేవి తనపని తాను చేసుకుంటూ పోతుందని, అలాంటి మహిళపై వైసీపీ నాయకులు నీచంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. వైపీసీ నాయకులు… ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబంపై అనుచితంగా మాట్లాడుతుంటే వారిని మందలించాల్సిన ముఖ్యమంత్రి వారి నాయకులును వెనుకేసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ నాయకులు అలాంటి మాటలు అనలేదని, వేసీపీ నాయకుల చేత చెప్పిస్తున్నారన్నారు. అదే విషయం స్వయంగా సీఎం జగన్ మీడియా ముందుకు వచ్చి చెప్పాలన్ననారు.

కేంద్రం అందుకే దిగొస్తుందా?

చంద్రబాబు ఊరూ వాడా దండోరా..!

కొడాలి నానికి భద్రత ఏందుకు పెంచారు..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -