Friday, April 19, 2024
- Advertisement -

తెలంగాణ కేబినెట్‌ విస్తరణ, వారిపై వేటు!

- Advertisement -

కేసీఆర్‌ ప్రభుత్వంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు మరోమారు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితను కేబినెట్‌లోకి తీసుకోవడ ఖాయమని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. అయితే, ఆమెను కేబినెట్‌లోకి తీసుకోవాలంటే మాత్రం ఎవరో ఒకరి పదవికి గండం తప్పదు. అలాగే కూతురు కోసం మంత్రివర్గ విస్తరణ చేస్తే విమర్శలు రావడం పక్కా. అందువల్లనే మంత్రుల పనితీరు కారణంగా ఒకరిద్దని తప్పించే కసరత్తు జరగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు టెన్షన్‌ పట్టుకుంది. తాము ఇంచార్జీలుగా ఉన్న విడిజన్లలో పారీ​ ఓటమే ఈ ఆందోళనకు కారణమని చెబుతున్నారు. అలా విఫలమైన వారిని తప్పిస్తే తప్ప కొత్తవారికి చాన్స్‌ రాదు. అలాగే కవిత కూడా ముషీరాబాద్‌లో ఫెయిల్‌ అయ్యారు. అయినా, ఆమెకు మినహాయింపు ఎలాగూ ఉంటుంది. మినహాయింపు లేనిదల్లా మిగతా మంత్రులకే.

విజయం వరించలేదు
దుబ్బాక ఓటమి తర్వాత నిర్వహించిన గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ బాగా దెబ్బతింది. ఇక్కడా బీజేపీ బలం పుంజుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులను డివిజన్లకు ఇంచార్జీలుగా నియమించినా పలుచోట్ల ఓటమి తప్పలేదు. ఒక్కో మంత్రికి ఒక్కో డివిజన్‌ కేటాయించినా వారి వ్యూహాలు ఫలించలేదు. డివిజన్లకు ఇంచార్జీలుగా ఉన్న చోట 9 మంది మంత్రులు సక్సెస్‌ అయితే.. నలుగురు మాత్రం పార్టీని విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో వారి భవిష్యత్‌పై రకరకాలుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. కేబినెట్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని నిర్ణయం తీసుకుంటే మాత్రం కొందరి నేతలకు ఇబ్బందులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపుకోసం పనిచేసి ఫెయిలైన నాయకుల్లో టెన్షన్‌ మొదలైంది.

సిట్టింగ్‌ స్థానాల్లో ఓటమి
ముషీరాబాద్‌లో అసెంబ్లీ నియోజకవర్గంలోని అడిక్‌మెట్‌ డివిజన్‌ను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు అప్పగించారు. ఆ డివిజన్‌లో అసంతృప్తులను బుజ్జగించడంలో మంత్రి సక్సెస్‌ కావడంతో అంతా అనుకూలంగానే ఉంటుందనుకున్నారు. కానీ, అడిక్‌మెట్‌లో బీజేపీ అభ్యర్థి గెలవడంతో శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు అధికార పార్టీ నాయకులు కంగుతిన్నారు. అలాగే మరో మంత్రి జగదీష్‌రెడ్డికి సరూర్‌నగర్‌ డివిజన్‌ బాధ్యతులు అప్పగించారు. అక్కడా బీజేపీ పాగా వేసింది. హిమాయత్‌నగర్‌ ఫలితం మంత్రి గంగుల కమలాకర్‌కు షాకిచ్చింది. మల్కాజిగిరి బాధ్యతలు మంత్రి ఈటల రాజేందర్‌ అప్పగించగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. ఆ డివిజన్‌లో కూడా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. సిట్టింగ్‌ స్థానాలను కాపాడని మంత్రుల పనితీరుపై పార్టీ అధినేత గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అదే నిజమైతే కొందరు మంత్రులపై వేటు తప్పదు!!

అత్త అలా.. అల్లుడు ఇలా.. సీఎం జగన్‌ ఆగ్రహం

రాహుల్‌ చెప్పినా వినను.. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తిరుపతి ఉప పోరు నువ్వా.. నేనా..

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -