Saturday, April 27, 2024
- Advertisement -

అత్త అలా.. అల్లుడు ఇలా.. సీఎం జగన్‌ ఆగ్రహం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి మరో వివాదంలో చిక్కుకున్నారు. రేవతి మేనల్లుడు వైద్య సిబ్బందిపై దాడి చేశాడంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి నర్సింగ్ హోమ్ సిబ్బందిపై రేవతి మేనల్లుడు వంశీ చేయి చేసుకున్నారు. వైద్యం చేయించుకున్నాక బిల్లు కట్టమని నర్సింగ్ హోమ్ సిబ్బంది అడిగారు.. దీంతో రెచ్చిపోయిన అతడు బిల్లు విషయంలో గొడవకు దిగారు. తాను వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి మేనల్లుడిని అంటూ బెదిరింపులకు దిగారు. డాక్టర్లు, నర్సింగ్ హోమ్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, గురువారం విజయవాడ సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద రేవతి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. టోల్ ప్లాజా వద్ద రూ.100 అడిగినందుకు సిబ్బందిపై దాడి చేశారు. ఆమె గుంటూరు నుంచి విజయవాడ వస్తుండగా.. కాజా టోల్ ప్లాజా వద్ద సిబ్బంది టోల్ చెల్లించాల్సిందిగా కోరారు. దీంతో రెచ్చిపోయిన ఆమె కార్పొరేషన్ ఛైర్ పర్సన్ అయిన నన్నే టోల్ ఫీజు కట్టమంటారా అంటూ సిబ్బందిపై వీరంగం వేశారు. అంతేకాదు తన కారుకు అడ్డుగా పెట్టిన బారికేట్లని స్వయంగా ఆమె తోసేశారు. అక్కడితో ఆగకుండా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఇలా అత్త రేవతి వివాదాల్లో నిలుస్తుంటే.. అల్లుడు వడియరాజు ఇలా దాడులు చేస్తూ వార్తల్లో నిలుస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం కార్యాలయం నుంచి రేవతికి ఫోన్!
రేవతిపై పెద్దఎత్తున విమర్శల రావడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆమెను వెంటనే తాడేపల్లి రావాల్సిందిగా ఆదేశించారు. బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న రేవతి అలా ప్రవర్తించడంపై సీఎం జగన్‌ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై వివరణ కోరడమే కాకుండా.. ఆమెపై సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎంఓ నుంచి ఫోన్ రావడంతో దేవుళ్ల రేపతి హుటాహుటిన తాడేపల్లి వెళ్లారు. మరోవైపు కాజా టోల్ ప్లాజా సిబ్బంది దేవుళ్ల రేవతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తమపై దాడికి దిగినందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రేవతిపై కేసు నమోదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -