Thursday, May 2, 2024
- Advertisement -

రాహుల్‌ చెప్పినా వినను.. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తాను పోటీ చేసేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు . తన కుమారుడు రఘువీర్ రెడ్డి ఉపఎన్నికలో పోటీ చేస్తాడని వెల్లడించారు. రెండేళ్ల కోసం తాను పోటీచేసి ఏం లాభం అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీచేయనని గతంలోనే చెప్పానని.. రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా తన నిర్ణయం మారబోదన్నారు. ఇక, పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఆయన.. పార్టీని విడిచివెళ్లాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. మీడియా ఈ ప్రచారం చేస్తుందన్నారు. పీసీసీ ఎవరన్న నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందన్నారు. పార్టీ తన ఇష్ట ప్రకారం పీసీసీని నియమిస్తుందన్నారు. తన అభిప్రాయాన్ని ఠాకూర్‌కు చెప్పానన్నారు.

ఇటీవల నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. త్వరలో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి జానారెడ్డిపై పడింది. సుదీర్ఘకాలం పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు జానారెడ్డి.. ఎన్నో కీలక పదవులను అధిష్టించారు. గత ఎన్నికల్లో నోముల చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు నోముల మృతితో ఉప ఎన్నిక తప్పని పరిస్థితి. దీంతో.. మరోసారి జానారెడ్డి పోటీ చేయడం ఖాయమని అంతా భావించారు. అయితే ఇలాంటి సమయంలో జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ నాగార్జునసాగర్‌లోనూ పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవచ్చునన్న ప్రచారం జరిగింది. నాగార్జునసాగర్ జానారెడ్డికి కంచుకోట కావడంతో ఇక్కడినుంచి ఆయన్ను గానీ ఆయన కుమారుడిని గానీ బరిలో దింపాలనే యోచనతో బీజేపీ వారితో సంప్రదింపులు జరిపిందన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా జానారెడ్డి ఇచ్చిన క్లారిటీతో ఆ పుకార్లకు తెరపడింది.

అడ్డంగా దొరికిపోయిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందా?

కారు పార్టీతో కాంగ్రెస్‌ కలిసి నడుస్తుందా?

బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అలాంటి నేతలే ప్రధాన టార్గెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -