Thursday, May 2, 2024
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందా?

- Advertisement -

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి గ్రేటర్‌లో భారీ షాక్ తగిలింది. వంద సీట్లు వస్తాయనుకున్న పార్టీకి గ్రేటర్ ప్రజలు షాక్ ఇచ్చారు. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలకు టెన్షన్‌ పట్టుకుంది. తాము ఇంఛార్జులుగా ఉన్న డివిజన్లలో పార్టీ ఓటమే ఈ టెన్షన్‌కు కారణమని చెబుతున్నారు. మరో మూడేళ్ల తరువాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందా? రాదా? అనే ఆందోళనలో గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారట.

రంగంలోకి మంత్రులు.. అయినా పరాభావమే
దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి తర్వాత నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దూకుడుకిగా వ్యవహరించింది.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులను డివిజన్లకు ఇంఛార్జులుగా నియమించింది. ఒక్కో మంత్రికి ఒక్కో డివిజన్‌ కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యేలు తమ పరిధిలోని డివిజన్ల గెలుపు కోసం కృషి చేశారు. కొంతమంది మంత్రులు తమ ప్రాంతాల నుంచి సొంత టీమ్‌ను దించారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫలితాల్లో ఛేదు అనుభవమే ఎదురైంది. ముఖ్యంగా సీనియర్‌ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌( అడిక్‌మెట్‌ డివిజన్‌), జగదీష్‌రెడ్డి(సరూర్‌నగర్‌ డివిజన్‌, ఈటల రాజేందర్‌(మల్కాజ్‌గిరి డివిజన్‌ , గంగుల కమలాకర్‌(హిమాయత్‌నగర్‌) ప్రచారం చేసిన డివిజన్లలో ఘోర పరాజయం ఎదురైంది. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన పలు డివిజన్లను టీఆర్‌ఎస్‌ కోల్పోయింది.

అదే కొంప ముంచిందా?
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చాలా మంది సిటింగ్ లకు టికెట్ లు ఇవ్వలేదు. కొంతమందికి టికెట్‌ ఇవ్వడానికి అధిష్టానం ముందుకు వచ్చినా.. స్థానిక ఎమ్మెల్యే అడ్డుకొని తమకు నచ్చిన వారికి ఇప్పించుకున్నారు. అలాంటి వారిలో కొంతమంది విజయం సాధించినా.. ఎక్కువ మంది ఓడిపోయారు. మరోవైపు అయితే ఫలితాల్లో టికెట్ లు దక్కించుకున్న చాలా మంది సిటింగ్ లు గెలవలేదు. స్థానిక ఎమ్మెల్యేల సహకారం లేకపోవడం వల్లే ఓడిపోయినట్టు అధిష్టానం దృష్టికి వచ్చిందట. ఈ విషయమే కార్యకర్తలు, నాయకులు, గెలిచిన కార్పౌరేటర్లతో కేటిఆర్ సమావేశం అయినపుడు చర్చకు వచ్చింది. సిటింగ్ లకు టికెట్ లు ఇవ్వడం అన్నది నష్టమే చేసింది అనే అర్ధం వచ్చేలా కేటిఆర్ కామెంట్ చేసారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ థియరీ కొంత పనిచేసినట్లు కనిపిస్తోంది. కేటిఆర్ కూడా ఆ సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. గ్రేటర్‌ ఎన్నికలు జరిగిన ఐదేళ్లకే నెగిటివిటీ వస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటై పదేళ్లు గడిచిన తర్వాత జరగబోయే ఎన్నికలకు( 2023 అసెంబ్లీ ఎన్నికలు) ఎంత వ్యతిరేకత వస్తుందోనని అధిష్టానం ఆందోళన చెందుతుందట. ఈ వ్యతిరేకతను తగ్గించాలంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కొత్త వ్యక్తులను రంగంలోకి దించాల్సిందే. ఒకవేళ సీఎం కేసీఆర్‌ అలాంటి నిర్ణయమే తీసుకుంటే తీసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చాలా మందికి టికెట్ లు రావు.అందుకే గ్రేటర్‌ ఎమ్మెల్యేలు టెన్షన్‌కు గురవుతున్నారట.

మార్పు సాధ్యమయ్యేనా..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త నాయకులను రంగంలోకి దించడం టీఆర్‌ఎస్‌కు అంత సులువైన టాస్క్ కాదు. ఒక వేళ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చినా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గొడవకు దిగుతారు. వారిలో కొంతమందిని అధిష్టానం బుజ్జగించినా.. ఎక్కువమంది అసంతృప్తిగానే ఉంటారు. అలాంటి వారికి వల వేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లకు టికెట్ లు ఇవ్వకపోతే వారు బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. అలాంటి వారిని తొందరగా కాషాయ దళంలో కలిపేసుకుంటుంది. వారు వ్యతిరేకంగా పని చేస్తే టీఆర్‌ఎస్‌కు కష్టం అవుతుంది. మొత్తం మీద గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు అటు టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి.. ఇటు గ్రేటర్‌ ఎమ్మెల్యేలకు టెన్షన్‌ పెట్టాయనే చెప్పాలి.

కారు పార్టీతో కాంగ్రెస్‌ కలిసి నడుస్తుందా?

మారకపోతే రాష్ట్రపతి పాలనే: బీజేపీ ఎంపీ హెచ్చరిక

ఇంత చేసినా చలించరా మోదీజీ..!

బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అలాంటి నేతలే ప్రధాన టార్గెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -