Friday, April 19, 2024
- Advertisement -

ఏపీకీ వ‌స్తా….బాబు బండారం బ‌య‌ట పెడ్తా…కేసీఆర్‌

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణా ఎన్నిక‌ల్లో కూట‌మి త‌రుపున ప్ర‌చారం చేసిన బాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడ ఆస‌క్తిక‌రంగా మారాయి.

చంద్రబాబు ఇక్కడ వచ్చి పనిచేశారని వ్యాఖ్యానించిన కేసీఆర్… తాము కూడా ఏపీకి వెళ్లి పని చేస్తామని అన్నారు. చంద్రబాబుకు తమకు గిఫ్ట్ ఇచ్చారని… త్వరలోనే ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు. మా గిఫ్ట్ ప్రభావం ఎలా ఉంటుందో కూడా త్వరలోనే తెలుస్తుందని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబునాయుడు గారు చెప్పారు. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్ కు లేదా? తప్పకుండా, తెలుగు ప్రజలు బాగుండాలని వందశాతం నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ లక్షకు పైగా ఫోన్లు వచ్చాయి. ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మెస్సేజ్ లు బోలెడు వచ్చాయి. మా వాళ్ల ఫోన్లు పగిలి పోయే పరిస్థితి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చంద్రబాబు, టీడీపీ విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన కచ్చితంగా ఏపీ పాలిటిక్స్‌లో ఏదో రకంగా ఎంట్రీ ఇస్తారనే విషయంలో క్లారిటీ వచ్చింది. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలో తాము ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని… రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తామని కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మాటలే కేటీఆర్ నోటి వెంట వచ్చాయని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. తాజాగా దీనిపై కేసీఆర్ స్వయంగా స్పష్టం ఇవ్వడంతో… ఆయన ఏపీలో ఏ రకంగా టీడీపీని టార్గెట్ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

నీతి ఆయోగ్ సమావేశాల్లో ప్రధాని మోదీని పొగుడుతూ చంద్రబాబు నాయుడు చాలాసార్లు బొక్క బోర్లా పడ్డారని.. ఆ సిడీలన్నింటినీ విజయవాడలో వేస్తామని చెప్పారు. ‘చంద్రబాబుకు పైత్యం ఉంది. ఆయన మోదీని అతిగా పొగడబోయి బొక్కబోర్లా పడ్డారు’ అని కేసీఆర్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -