Friday, April 26, 2024
- Advertisement -

క్యూలో నిల్చుని ఓటేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై..

- Advertisement -

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌, అసోంలలో నేడు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. మరోవైపు, దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటర్లు సురక్షితంగా ఓటుసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

హీరో విజయ్ సైకిల్ పై వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విరుకం బాకంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న గవర్నర్ క్యూలో తన ఓటు వేశారు. తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఆయన భార్య, కుమారుడు ఉదయనిధితో కలిసి తేనాంపేటలోని సైట్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం శివగంగ జిల్లా కందనూరులోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు. కాగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉదయాన్నే థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరిస్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటేయగా, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమలహాసన్ తన కుమార్తెలు అక్షర హాసన్, శ్రుతిహాసన్‌తో కలిసి వచ్చి తేనాంపేటలోని చెన్నై స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -