Saturday, April 20, 2024
- Advertisement -

కేరళలో చివరి దశ పోలింగ్ నేడే..!

- Advertisement -

కేరళలో స్థానిక సమరం చివరి అంకానికి చేరుకుంది. నేడు చివరి దశ పోలింగ్​ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 354 స్థానిక సంస్థల పరిధిలోని 6,867 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

నాలుగు జిల్లాల(మల్లాపురం, కోజికోడ్​, కన్నూర్​, కాసరగోడ్​)లో జరిగే ఈ పోలింగ్​కు 10,842 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1,105 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్​లను గుర్తించి వాటిని ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 52,285 మంది అధికారులు పాల్గొననున్నారు. సిబ్బందిని ముందురోజే పోలింగ్​ సామగ్రితో ఆయా కేంద్రాలకు తరలించింది ఈసీ.

చివరిదశ పోలింగ్​లో మొత్తం 89,74,993 మంది ఓటు వేయనున్నారు. 42,87,597మంది పురుషులు; 46,87,310 మంది స్త్రీలు సహా.. 86 మంది ట్రాన్స్​జెండర్లు ఈ దఫా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిసెంబర్​ 16 న ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -