Friday, May 10, 2024
- Advertisement -

రంగా 30వ వ‌ర్ధంతి ర్యాలీలో ఎక్క‌డా క‌నిపించ‌న వైసీపీ జెండాలు..

- Advertisement -

త్వ‌ర‌లో వైసీపీకీ బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా…? ముఖ్య‌నేత పార్టీ మారుతున్నారా…? విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో గ‌త కొద్ది రోజులుగా ఇదే హ‌ట్‌టాఫిక్‌గా మారింది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే అవున‌నే అంటున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో.. రాధా వైసీపీని వీడి మరో పార్టీలోకి జంప్ చేయనున్నార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అవుననే సందేహాలే కలుగుతున్నాయి.

వంగవీటి మోహనరంగా 30వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆయన విగ్రహానికి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రంగా ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా రంగాకు అభిమానులు ఉన్నారని రాధా వ్యాఖ్యానించారు. కాటూరులో మూడు ఎకరాలలో రంగా పేరుతో స్మృతి స్థూపం నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం తన అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా కదిలివెళ్లారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా ఇక్క‌డే రాధా పార్టీ మ‌ర‌నున్నార‌నే దానికి స్ప‌ష్ట‌మైన సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఈ ర్యాలీలో.. ఎక్కడా కనీసం ఒక్కటి కూడా వైసీపీ జెండా కనిపించలేదు. సాధారణంగా ఏ కార్యక్రమం చేపట్టినా కార్యకర్తల చేతుల్లో పార్టీ జెండాలు కనిపిస్తాయి. ఈ ర్యాలీలో ఒక్కరిదగ్గర కూడా కనిపించలేదు. దీంతో.. రాధా పార్టీ మారడం కాయమంటూ ప్రచారం మొదలైంది.

గ‌త కొంత కాలంగా విజయవాడ సెంట్రల్ సీటు విష‌యంలో వైసీపీ అధిష్టానానికి, రంగాకు మ‌ధ్య విబేధాలు నడుస్తున్నాయి. ఆ సీటును మ‌ల్లాది విష్ణుకు కేటాయించడంతో అప్ప‌టినుంచి జ‌గ‌న్‌పై రాధా గుర్రుగా ఉన్నారు. అనేక సార్లు సెట్ర‌ల్ సీటుపై రంగా జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా ఫ‌లితం క‌నిపించ‌లేక‌పోవ‌డంతో కొన్ని రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. తాజా ప‌రిణామాల‌తో రంగా వేరే పార్టీలోకి జంఫ్ అవుతున్నార‌నే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -