Wednesday, May 8, 2024
- Advertisement -

అలకబూనిన అధికార పార్టీ నేతలు

- Advertisement -

పాత క్యాబినెట్‌లో మంత్రులుగా పని చేసిన కొందరి మళ్లీ ఛాన్స్ దక్కలేదు. దాంతో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిని బుజ్జగించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకోసం కొందరికి వివిధ పోస్టు కల్పిస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్‌ హోదాలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. త్వరలో ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ చీఫ్ విప్ గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ స్పీకర్‌గా కొలగట్ల వీరభద్రస్వామిని నియమించే అవకాశం ఉంది.

కొత్త జిల్లాల కంటే సామాజిక, రాజకీయ సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీలో దాదాపు 20 మందికిపైగా నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ బుజ్జగించే పనిలో పడ్డారు సీనియర్ నేతలు.

రోజాకు బంఫర్ ఛాన్స్

వైసీపీలో అసంతృప్తి సెగలు

పాత, కొత్త కలయికగా మంత్రివర్గ కూర్పు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -