Friday, May 3, 2024
- Advertisement -

టికెట్ వ్య‌వ‌హ‌రాంపై ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న వైసీపీ…

- Advertisement -

విశాఖ జిల్లాలో టీడీపీ మ‌రో సారి ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే జిల్లాకు చెందిన పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు వైసీపీ లోకి వెల్లేందుకు స‌ర్వం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే వైసీపీతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అయితే టికెట్ కేటాయించే వ్య‌వ‌హారంలో వైసీపీ అచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

జిల్లాలోని ఓ నియేజ‌క‌వ‌ర్గంనుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. మళ్లీ అదే స్థానం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం వస్తుందని భావించారు. అయితే అప్పటికే ఆరోపణలు వుండడంతో తెలుగుదేశం అధిష్ఠానం టిక్కెట్‌ ఇవ్వలేదు . ఎమ్మెల్సీ టీటుపైన పెట్టుకున్న అడియాశ‌ల‌య్యాయి.

వ‌చ్చె ఎన్నిక‌ల్లో కూడా టీడీపీనుంచి టికెట్ ద‌క్కే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్ప‌టికే త‌మ అనుచ‌రుల‌తో మంత‌నాలు జ‌రిపిన స‌ద‌రునేత అంతా అనుకూలంగా వుండడంతో వైసీపీ పెద్దలను కలిశారు. పార్టీలో చేరతానని, తాను రెండుసార్లు గెలిచిన నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు.

త‌ను కోరుకున్న చోట టికెట్ ఇస్తే .. పక్కనే వున్న ఎస్‌సీ నియోజకవర్గం ఖర్చు కూడా తానే పెట్టుకుంటానని చెప్పినట్టు సమాచారం. అక్కడ అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వడానికి కుదరకపోతే అనకాపల్లి ఎంపీగానైనా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినట్టు తెలిసింది. అయితే వైసీపీ అధిష్ఠానం మాత్రం జిల్లాలో కాకుండా విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించినట్టు తెలిసింది.

మంచి సందర్భం చూసుకొని చేరతానని మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చర్చల తరువాత కూడా ఆయన నియోజకవర్గంలో మ‌రోసారితన అనుచరులతో సమావేశమై పార్టీ మారబోతున్నామని, అందరూ సంసిద్ధులుగా వుండాలని కోరినట్టు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -