Thursday, May 9, 2024
- Advertisement -

బాబు వాడ‌కం పూర్త‌య్యింది…

- Advertisement -

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి బాబు చేతిలో చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది.నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో మంత్రులంద‌రూ పాల్గొంటుంటే జేసీ మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టారు చంద్ర‌బాబు.చంద్రబాబు రాయలసీమలో ఎక్కడ మీటింగ్‌ పెట్టినా జేసీ దివాకర్ రెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకుని జగన్‌ను బండబూతులు తిట్టించేవారు ముఖ్యమంత్రి.అయితే ఆడోస్ విక‌టించి రెడ్డి సంఘం స‌మావేశంలో స‌ద‌రు సామాజిక వ‌ర్గం వారు మాట్లాడ‌కుండా దూరం పెట్టారు.

ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల వేళ చంద్రబాబు కూడా జేసీ దివాకర్‌ రెడ్డిని రెడ్డి వ్యతిరేకిగా గుర్తించారు. అందుకే ఆయనకు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. జేసీ టీడీపీ తరపున ప్రచారం చేస్తే భూమా బ్రహ్మానందరెడ్డికి పడే రెడ్డి ఓట్లు కూడా పడవన్న భావనకు చంద్రబాబు వచ్చారు.అందుకే జేసీ బ్రదర్స్‌ను నంద్యాల ఉప ఎన్నికలకు చంద్రబాబు దూరంగా ఉంచినట్టు చెబుతున్నారు

అయితే నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి తమను దూరంగా పెట్టడంపై జేసీ బ్రదర్స్ అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. జేసీ ప్రచారం చేస్తే రెడ్డి ఓటర్లు దూరమయ్యే పరిస్థితే ఉంటే.. మరి వైసీపీని నుంచి ఫిరాయించి మంత్రి పదవులు కూడా తీసుకుని జగన్‌ను నిత్యం బూతులు తిడుతున్న ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డిలు నంద్యాలలో ప్రచారం చేస్తే మాత్రం జనం శాలువా కప్పి సన్మానం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

అసలు జగన్‌ను సోమిరెడ్డి తిట్టినంతగా ఎవరూ తిట్టడం లేదని… ఇప్పుడు ఆయన కూడా నంద్యాలలో తిష్టవేశారు కదా అని గుర్తు చేస్తున్నారు. మనసులో ఏదో పెట్టుకునే జేసీ బ్రదర్స్‌ను చంద్రబాబు పక్కన పెడుతున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స‌భ‌ల‌లో జగన్‌ను తిడుతుంటే ఆనందించి ఇప్పుడు మాత్రం జేసీపై రెడ్డి వ్యతిరేకిగా ముద్రవేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -