Wednesday, May 8, 2024
- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో ప‌రిస్థితేంటో…

- Advertisement -

ప్ర‌శ్నించ‌డానికే తాను ఉన్నానంటూ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాజాపా-టీడీపీకూట‌మికి మ‌ద్ద‌తిచ్చిన జ‌న‌సే అధినేత త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు.ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన సైనికులు ఎంపిక త‌ప్ప పార్టీ నిర్మానంపై క‌స‌ర‌త్తులు మొదలు పెట్ట‌లేదు. త‌మ స‌త్తా నిరూపించుకొనేందుకు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లోగాని…కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోగాని పోటీ చేస్తామ‌ని ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

సొంత జిల్లాలోనే జనసేనకు దిక్కులేదు దిక్కులేదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏమాంత్రం పోటీనిస్తుందోన‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏడేళ్ళ తర్వాత జిల్లాలో జరుగుతున్న ఓ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ గురించి ఆలోచించకపోవటం ఆశ్చర్యంగా ఉందిజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ది కూడా ఇదే జల్లాలోని మొగల్తూరు.

ఒకసారి టిడిపి నేతలను విమర్శిస్తూ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తూ మొత్తానికి చంద్రబాబుకు దగ్గర అని అనిపించుకున్నారు. అటువంటి సమయంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని భారీ ప్రకటన చేసారు. కానీ తర్వాత మాత్రం తనదైన స్టైల్లోనే అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఒకవైపు రాజకీయ వేడి పెరిగిపోతున్నా, రాజకీయ సమీకరణలు మారిపోతున్నా పవన్ మాత్రం ఏ విషయంలోనూ స్పందించటం లేదు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఏలాంటి నిర్న‌యం తీసుకుంటారోన‌ని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.కాని ఇప్ప‌టి వ‌ర‌కు స్పంద‌న లేదు.ఇప్పుడు కాకినాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వ‌చ్చిప‌డ్డాయి. వైసీపీ, టీడీపీ మ‌ధ్య పోటాపోటీ నెల‌కొంది. చివరకు వామపక్షాలు, కాంగ్రెస్ కూడా రంగంలోకి దూకాయి. అయినా పవన్ పత్తాలేడు.

ఇప్ప‌టికే నామినేష‌న్ల ప‌ర్వం కొనాసాగుతోంది. జ‌న‌సేన కూడా ఏంచేస్తుందోన‌ని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు.కార‌నం కాకినాడ ప‌వ‌న్ సొంత జిల్లా కావ‌డంతో అంద‌రి దృష్టి ప‌వ‌న్‌పై ప‌డింది.సొంత జిల్లాలోనె దిక్కులేనిదిగా జ‌న‌సేన త‌యార‌య్యింద‌ని జ‌నాలు అనుకుంటున్నారు..

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -