Thursday, May 2, 2024
- Advertisement -

అచ్చెంనాయుడుని దూరం పెట్టిన బాబు?

- Advertisement -

టీడీపీ ఫైర్ బ్రాండ్ అచ్చెంనాయుడుకి ఏమైంద‌ని చాలామంది అనుకుంటున్నారు. దీనిక గ‌ల‌ కార‌ణ‌లు లేక‌పోలేదు. గ‌త కొంత కాలాంగా ఆయ‌న బ‌య‌ట ఎక్క‌డ కనిపించ‌డం లేదు. అచ్చెంనాయుడు టీడీపీలో కీల‌క స‌భ్యుడు,పైగా మంత్రి.పార్టీలో అనర్గళంగా మాట్లాడే నేత‌లలో ఒక‌డిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎర్రంనాయుడు త‌మ్ముడిగా రాజకీయ‌ల‌లోకి వ‌చ్చిన త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.

ప్ర‌త్య‌ర్థి పార్టీపై విరుచుకుప‌డే నైజం అచ్చెంనాయుడుది.అసెంబ్లీలో జ‌గ‌న్‌పై తీవ్ర ప‌ద‌జాలంతో దూసుకుపోయ్యేవారిలో వినిపించే పేర్లలో మొట్ట‌మొద‌టి పేరు అచ్చెంనాయుడుదే. మ‌రి అలాంటి అచ్చెంనాయుడు గ‌త‌కొంత కాలాంగా పార్టీలో సైలెంట్‌గా ఉన్నాడు. అచ్చెంనాయుడు ఎప్పుడు మీడియా స‌మావేశం పెట్టి ప్ర‌త్య‌ర్థి పార్టీ అయిన వైఎస్ఆర్‌సిపిని క‌డిగిప‌రేస్తారు.మ‌రి అలాంటి నేత ఎందుకు సైలెంట్ అయ్యార‌ని అనుమానం అంద‌రిలోను ఉంది. చంద్ర‌బాబు అచ్చెంనాయుడుని దూరం పెట్టార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి..దానిలో భాగంగానే అచ్చెంనాయుడుకు ఎటువంటి బాద్య‌తలు అప్ప‌గించ‌డం లేద‌ని తెలుస్తుంది. పార్టీలో కూడా అవ‌మానాలు ఎదుర్కొంటున్నారు అచ్చెంనాయుడు. మంత్రి స్థానంలో ఉండి కూడ త‌న‌కు ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని త‌న వాళ్ల ద‌గ్గ‌ర వాపోతున్న‌ట్లు స‌మాచారం.

త‌న క‌న్నా త‌క్కువ స్థాయి వాళ్ల‌కు ఎక్కువ ప్ర‌ముఖ్య‌త ఇవ్వ‌డంతో అచ్చెంనాయుడు పార్టీలో కినుకు వ‌హించార‌ని దీనిలో భాగంగానే ఆయ‌న పార్టీలో సైలెంట్ అయ్యార‌ని తెలుస్తుంది. పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్న త‌న‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీ వాళ్లు తీసుకోర‌నే భావ‌న‌తో ఉన్నారు. ఇక చేసేది ఏం లేక తెలుగు దేశం పార్టీలో అలా కొన‌సాగుతున్నారు.మ‌రి అచ్చెంనాయుడు భ‌విష్య‌త్తు ఏమౌతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -