Wednesday, April 24, 2024
- Advertisement -

డిల్లీ లిక్కర్ స్కామ్ : కే‌సి‌ఆరే మెయిన్ టార్గెట్ ?

- Advertisement -

డిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లిక్కర్ పాలసీలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, ఈ స్కామ్ కు సంబంధించి డిల్లీ డిప్యూటీ సి‌ఎం మనిష్ సిసోడియ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్ ను తెరపైకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ వ్యూహమేననిది జగమెరిగిన సత్యం. గత కొంత కాలంగా బీజేపీ ప్రతికూల పార్టీ నేతలు ఈడీ, సిఐడి, ఏడి కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీజేపీ పార్టీకి సంబంధించిన నేతల అవినీతి మాత్రం బయటకు రావడం లేదు.

కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలు మాత్రమే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ” బీజేపీకి లొంగిపోవాలి లేదా అక్రమ కేసుల బారిన పడాలి ” అనే వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణపై గట్టి ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. కే‌సి‌ఆర్ ను ఇరకాటంలో పెట్టె ఏ చిన్న అవకాశం కూడా వదలడం లేదు. తాజాగా డిల్లీ లిక్కర్ స్కామ్ లో కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత హస్తం ఉండని కమలనాథులు గట్టిగానే ఆరోపిస్తున్నారు. కే‌సి‌ఆర్ కుటుంబ సభ్యుల సూచలనల మేరకే డిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీను రూపొందించిందని, లిక్కర్ మాఫియాతో పాటు కే‌సి‌ఆర్ కుటుంబ సభ్యుల ద్వారా మనిష్ సిసోడియ కు 150 కోట్ల రూపాయలు చేతులు మరాయని బీజేపీ నేతలు గట్టిగానే ఆరోపిస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలు నిరాదరమైనవి అని పరువు నష్టం దావా కింద ఎమ్మెల్సీ కవిత హైదరబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాంతో కవితకు పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఆదేశించింది. అయితే బీజేపీ నేతల మెయిన్ టార్గెట్ మాత్రం కే‌సి‌ఆర్ అనేది అందరికీ తెలిసిందే. కే‌సి‌ఆర్ జైలు వెళ్ళడం ఖాయం అని గత కొంత కాలంగా కమలనాథులు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే కే‌సి‌ఆర్ మాత్రం.. ” ఈడీ లకు బోడి లకు బయపడేది లేదని ” గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితా పేరు తెరపైకి రావడంతో కే‌సి‌ఆర్ కాస్త ఇరకడంలో పడ్డారట. డిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక ఉన్నది కేసీయారే అని కమలనాథులు బాగా ప్రేజెక్ట్ చేస్తున్నారు. మరి కే‌సి‌ఆర్ ను ఈ స్కామ్ లో ఎలా తెరపైకి తెస్తారో చూడాలి.

Also Read

మోడీ ఫోకస్ డిల్లీ పైన పడిందా ?

పవన్ మాస్టర్ ప్లాన్ !

బీజేపీ ” సినీ వ్యూహం ” ఎందుకో మరి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -