Thursday, March 28, 2024
- Advertisement -

కబలిస్తోన్న బీజేపీ.. మిత్రపక్షాలకు కూడా తిప్పలు !

- Advertisement -

ప్రస్తుతం బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు అనుకూల పార్టీలలో గుబులు పుట్టిస్తోంది. బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికి ఆయా పార్టీలపై పూర్తి ఆధిపత్యం కోసం కాషాయ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహాలు మిత్రా పక్ష పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు ఎన్డీయే కూటమిలో భాగమైన శివసేనను ఎవరు ఊహించని విధంగా ఆ పార్టీకి చెందిన ఏక్ నాథ్ షిండే ద్వారా చీల్చి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టి షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ గుప్పిట్లో ఉంచుకుంది బీజేపీ అధిష్టానం. అయితే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది షిండే అయినప్పటికి అక్కడ పరిపాలన మాత్రం బీజేపీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దీంతో బిజెపీకి శివసేన షిండే వర్గంలోని ఎమ్మెల్యేలకు పొసగడం లేదని జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే మంత్రి వర్గ విస్తరణలో కీలక పదవులన్నీ బీజేపీ నేతలు తీసుకోవడం, పెద్దగా ప్రాధాన్యం లేని పదవులు షిండే వర్గం వారికి కట్టబెట్టడం వంటివి చోటు చేసుకోవడంతో ముందు రోజుల్లో షిండే వర్గం వారిని కూడా బీజేపీలో కలిపేసుకోనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ భావంకులే నియమితులయ్యారు.

ఈయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి.. చీలిన శివసేన ( షిండే వర్గం ) నియోజిక వర్గాలలో పర్యటిస్తూ.. నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన నాయకులు బరిలోకి దిగుతారు అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. చంద్రశేఖర్ భావంకులే చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. చీలిన శివసేన వర్గం ఎమ్మేల్యేలు పోటీ చేసే స్థానాలలో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దించే ప్రణాళికలు బీజేపీ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది. దీంతో బీజేపీని నమ్ముకొని శివసేనను చీల్చిన షిండేకు తిప్పలు తప్పేలాలేవు. మరి షిండే బిజెపీకి పూర్తిగా సరెండర్ అవుతారా లేక బీజేపీ నుంచి తెగతెంపులు చేసుకునే ప్రయత్నం చేస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read

కే‌సి‌ఆరే మెయిన్ టార్గెట్ ?

మోడీ ఫోకస్ డిల్లీ పైన పడిందా ?

కే‌సి‌ఆర్ భయపడుతున్నారా.. భయపెడుతున్నారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -