Thursday, May 9, 2024
- Advertisement -

రైతుల గురించి కీలక ప్ర‌క‌ట‌న చేసిన జ‌గ‌న్‌

- Advertisement -

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ ఈసారి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితుల్లో అధికారంలోకి రావాలని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీనికోసం ఆయ‌న చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఒకేసారి 175 ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్య్య‌ర్థుల‌ను ఒకేసారి ప్ర‌క‌టించి ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌చార స‌భ‌లు నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌కు అనేక‌ హామీల‌ను ఇస్తున్నారు. తాజాగా వైఎస్ జ‌గ‌న్ రైతులు గురించి ఓ కీలక ప్ర‌క‌ట‌న చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబానికి తన ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారాన్ని అందిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. ఆయ‌న మంగ‌ళ‌వారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో పాల్లొన్నారు. ఈ ప్ర‌చార స‌భలో జ‌గ‌న్ మాట్లాడుతు …నాన్న‌గారు దివంగ‌త నేత వైఎస్ఆర్ రైతుల‌కు ఎంతో సేవ చేశార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇకపై రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తానని చెప్పారు. పొరపాటున ఓ ఒక్క రైతు అయిన మ‌రణించిన ఆ రైతు కుటుంబానికి ఆర్థిక సాయం విషయంలో తొలి సభలోనే చట్టాన్ని తెస్తామని అన్నారు. రైతులకు అండగా నిలచే ప్రభుత్వం రావాలన్న లక్ష్యం తనదని, ఈ డబ్బుపై ఎవరికీ అధికారం ఉండదని అన్నారు. ఈ సంద‌ర్భంగా పోలవరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు జ‌గ‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -