Thursday, April 25, 2024
- Advertisement -

బాబుది నీదినోరా…? కాదు కాదు అబ‌ద్దాల ప్యాక్ట‌రీ..వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని కె.కోటపాడులో జరుగుతున్న బహిరంగసభలో చంద్ర‌బాబు నాయుడుపై జ‌గ‌న్ నిప్పులు చెరిగారు.బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చ‌క్కెర ఫ్యాక్ట‌రీల‌న్నీ మూత‌ప‌డ్డాయ‌ని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న చోడవరం సహకార చక్కెర ఫ్యాక్టరీని నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో 45వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లారని మండిప‌డ్డారు.

ఇటీవల గుంటూరులో జరిగిన ‘నారా హమారా – టీడీపీ హమారా’ ముస్లిం మైనార్టీల బహిరంగ సభలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేసేందుకు యత్నించారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ స్పందించారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలని కొట్టి పారేశారు.

గుంటూరు సభలో ముస్లిం యువకులు ప్లకార్డులు ప్రదర్శిస్తే.. అమాయకులైన ముస్లింలను పోలీసులు నిర్బంధించారని, స్టేషన్ నుంచి స్టేషన్ కు తిప్పుతూ వారిని కొట్టి 30 గంటలు హింసించారని ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసిన ముస్లిం యువకులను విడిపించడానికి వెళ్లిన తమ పార్టీ నాయకులను కూడా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో అనేక హామీలను ప్రజలకు ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు, పొదుపు సంఘాల మహిళకు రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ వాటిని రద్దు చేయలేదు. తుని ఘటనలో చంద్రబాబే రైలు తగులబెట్టించి, ఆ నెపం వైసీపీపై నెట్టారని, ‘చంద్రబాబుది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా?’ అని బాబుపై జగన్ దుమ్మెత్తిపోశారు.

రాష్ట్రంలో మద్యం పూర్తిగా రద్దు చేస్తామన్నారు. కానీ ప్రతీ గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. లక్షానలభై వేల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. రాష్ట్రానికి ఏంతో కీలమైన ప్రత్యేక హోదాను కూడా తన ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారు. గతంలో జగన్‌కు ఓటు వేస్తే కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే అన్నారు. ఇప్పుడేయో.. జగన్‌కు ఓటు వేస్తే బీజేపీ ఓటు వేసినట్లే అంటున్నారు. ఆయన ఎవరితో కాపురం చేస్తే వాళ్లే మంచివాళ్లు. చంద్రబాబు పాలనలో కేవలం అవినీతి, అన్యాయం, అక్రమాలు తప్ప ఏమీ లేద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -