Friday, April 19, 2024
- Advertisement -

లోటస్‌పాండ్‌లో రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల..!

- Advertisement -

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తా అంటూ ప్రజల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు వైఎస్ షర్మిల. త్వరలో పార్టీ జెండా, అజెండా అన్ని వెల్లడిస్తా అంటూ ఇటీవల ఖమ్మం సభలో తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు. అయితే, సాయంత్రం తరువాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు.

లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలోనే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు యువత చనిపోతుంటే చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏదో ఒక రోజు తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. తాను మూడు రోజులపాటు దీక్ష చేసి తీరుతానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. లోటస్ పాండ్ ఆవరణ బయట తాత్కాలికంగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారు జామునే వైఎస్ షర్మిల.. దీక్షా శిబిరంలో కూర్చున్నారు.

సాగర్ లో మూగబోయిన మైకులు..

నేటి పంచాంగం, శుక్రవారం (16-04-2021)

టీఆర్ఎస్ లో విషాదం.. మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -