Saturday, April 27, 2024
- Advertisement -

టీఆర్ఎస్ లో విషాదం.. మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి!

- Advertisement -

ఇటీవల తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా కాటుకు బలి అవుతున్నారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణలో మంత్రిగా సేవలందించిన నేత అజ్మీరా చందూలాల్ తీవ్ర అనారోగ్యం కారణంగా హఠాన్మరణం చెందారు. అజ్మీరా చందులాల్ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు మండలం జగ్గన్నపేటలో 1954 ఆగస్టు 17న జన్మించిన ఆయన సర్పంచిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.  కరోనాతో బాధపడుతున్న ఆయన..మూడు రోజుల కింద హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు.

ఇటీవల ఆయన కిడ్నీలు విఫలం కాగా, కొత్త కిడ్నీలను అమర్చారు. అప్పటి నుంచి డయాలసిస్ పైనే ఆధారపడిన ఆయన, ఇటీవల మరోమారు అనారోగ్యానికి గురై, చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కిమ్స్ లో చేరారు. పరిస్థితి విషమించి, గురువారం రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో గిరిజనశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన..తెలంగాణ తొలి కేబినెట్‌లో టూరిజం, సాంస్కృతికశాఖ మంత్రిగా పనిచేశారు.

ప్రస్తుత ములుగు జిల్లా జగ్గన్నపేటలో 17 ఆగస్టు 1954న జన్మించిన 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచారు. మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చందూలాల్ మరణం పార్టీకి తీరనిలోటని అన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నేనూ తెలంగాణ బిడ్డనే.. ఏదో ఒకరోజు సీఎం అవుతా..

షర్మిల దీక్ష భగ్నం… స్వల్ప గాయాలు… నాపై ఇంకో సారి చెయ్యి పడితే కబర్దార్…

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -