Thursday, May 9, 2024
- Advertisement -

టీడీపీ కంటే తక్కువొస్తే ఏపీలో ఔట్

- Advertisement -

తెలంగాణలో పోటీ చేయాలా ? వద్దా ? చేస్తే లాభమేంటి ? నష్టమెంత ? తమ పోటీ వల్ల ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అసలు గెలుపు అవకాశాలు ఎంత ? ఓడిపోతే భవిష్యత్ ఏంటి ? ఇలా అనేక రకాలుగా వైఎస్ఆర్ సీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. జగన్ కలలో కూడా మండిపడే కాంగ్రెస్ ను దెబ్బ తీయాలంటే, తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి అభిమానులు బలంగా ఉన్న ఓ 15 నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను పెట్టాలని ముందు డిసైడ్ అయ్యారు. దాని ద్వారా తాము గెలుస్తామని కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్ అభ్యర్ధుల ఓట్లు చీలిపోయి, టీఆర్ఎస్ కు మేలు జరిగితే చాలు అని…కానీ అది కూడా బెడిసి కొట్టి అసలుకే ఎసరొస్తుందని జగన్ అండ్ టీం భయపడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీయాలనో, టీఆర్ఎస్ ను గెలిపించాలనో తాము బరిలో దిగితే కచ్చితంగా, వైఎస్ జగన్ అక్కడ ప్రచారం చేయాల్సిందే. ఆయన విస్తృతంగా చేయకపోయినా, కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయక తప్పుదు. అంత చేసినా ఎంతమంది గెలుస్తారు ? ఎంత ఓట్లు సాధిస్తారు ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరోవైపు టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా అక్కడ కచ్చితంగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తారు. ఆ పార్టీ అభ్యర్ధులు ఎంత మంది గెలిచినా, ఎన్ని ఓట్లు సాధించినా ఆ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఓడిపోయినా ఆ పార్టీకి పెద్దగా పోయేదేం లేదు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ తెలంగాణలో చేదు అనుభవాలను చూసింది. అన్నింటికంటే ముఖ్యంగా దాదాపు 18 ఎమ్మెల్యేలను గెల్చుకున్నా, వాటిలో 15 మంది టీఆర్ఎస్ గూటిలో చేరిపోయారు. జగన్ పార్టీ 92 స్థానాల్లో పోటీ చేసి ముగ్గురునే గెలిపించుకుంది. ఆ ముగ్గురు కూడా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అప్పుడే వైఎస్ఆర్ సీపీ కంటే టీడీపీ ఎక్కువ స్థానాలు గెల్చుకుని ఏపీలోనే కాదు తెలంగాణలోనూ వైఎస్ఆర్ సీపీ కంటే టీడీపీయే ఆధిక్యంలో ఉంది. బలంగా ఉంది, ప్రజల ఆశీస్సులు, ఓట్లు తమకే అని చాటి చెప్పారు టీడీపీ నేతలు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయితే తమ పరిస్థితి ఏంటి ? అని ఏపీ వైఎస్ఆర్ సీపీ నేతలు భయపడుతున్నారు. టీఆర్ఎస్ గెలుపు కోసం, కాంగ్రెస్ ఓటమి కోసం తాము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే, దారుణమైన ఫలితాలు వస్తే, ఆ ప్రభావం ఏపీలో పడుతుంది. టీడీపీ ఆధిక్యత పెరుగుతుంది. ఏపీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి, టీడీపీకి అస్త్రాలు ఎందుకు ఇవ్వడం అని వైఎస్ఆర్ సీపీ నాయకులు జగన్ కు సూచించారు. పైగా అక్కడ బరిలో దిగగానే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కోసమే జగన్ పోటీ చేయిస్తున్నాడు. అని ఏపీలో విస్త్రృత ప్రచారం చేస్తారు. రాష్ట్ర విభజనకు కారమయ్యారనే టీఆర్ఎస్ పై ఏపీ ప్రజలు ఇప్పటికీ మండిపడుతున్నారు. పైగా ఇటీవల ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు మాట మార్చేశారు. అలాంటి పార్టీ కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం జగన్ తన మనుషులను పోటీకి పెట్టాడు అని ప్రచారం చేస్తారు. దానికి తోడు ఫలితాల్లో టీడీపీ కంటే తక్కువ శాతం ఓట్లు వస్తే, కచ్చితంగా ఆ ప్రభావం ఏపీలో పడుతుందని భయపడుతున్నారు. అందుకే తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ పోటీ చేయకూడదనే ఆ పార్టీ ఏపీ నేతలు జగన్ చెవిలో జోరీగల్లా చెబుతున్నారు. మరి వారి మాట జగన్ వింటాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -