Tuesday, April 30, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ!

- Advertisement -

గత కొన్నాళ్లుగా తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కు మరియు కేంద్ర ప్రభుత్వానికి మద్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాస్త సమయం దొరికితే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు సి‌ఎం కే‌సి‌ఆర్. మోడీ పరిపాలనపై, బీజేపీ విధానాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి విధితమే. ఇక కే‌సి‌ఆర్ పై కూడా ఆ మద్య మోడీ తివ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో మోడీ వర్సస్ కే‌సి‌ఆర్ మద్య రాజకీయ వివాదం రోజు రోజుకు తీవ్రమౌతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు షాక్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. .

దేశ వ్యాప్తంగా అమలౌతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, ముఖ్యంగా తెలంగాణలో నిబంధనల మేరకు పనులు సవ్యంగా జరగడం లేదని ఆ మద్య రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ప్రతినిధుల బృందం చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించి నివేధిక కూడా రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపగా.. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని నిర్ధారించింది. ఉపాధి హామీ పథకానికి చెందిన రూ. 152 కోట్ల నిధులను కే‌సి‌ఆర్ సర్కార్ దారి మళ్లించిందని, ఇందుకు సంబంధించి ఈ నెల 30 లోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఒకవేళ ఈ డబ్బు చెల్లించని పక్షంలో తదుపరి విడుదల అయ్యే నిధులను నిలిపియేయనున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఉపాధి హామీ పథకానికి సంబంధింన నిధులను ఇతర పథకాలకు అనుమతి లేకుండా దారి మళ్లించారని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే చాలా రాష్ట్రాలలో ఉపాధి హామీ పథకంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కేవలం తెలంగాణ ప్రభుత్వానికే నోటీసులు జారీ చేయడంతో.. కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కే‌సి‌ఆర్ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కారణంగానే మోడీ సర్కార్ నోటీసులు జారీ చేసిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ నోటీసులపై కే‌సి‌ఆర్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

లోకేశ్ పాదయాత్ర.. వైసీపీ నేతలెందుకు అంత ఖుషీ!

వలసలు తెలంగాణకా.. పక్క రాష్ట్రాలకా?

ఇదేంటి చంద్రబాబు.. జగన్ను కాపీ కొట్టడమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -