Tuesday, May 7, 2024
- Advertisement -

అవిశ్వాస‌తీర్మానం మీరుపెట్ట‌డండి.. నేను మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తా… ప‌వ‌న్‌

- Advertisement -

అవిశ్వాస తీర్మానంపై జ‌గ‌న్ చేసిన స‌వాల్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఘాటుగా స్పందించారు. జ‌గ‌న్ చేసిన స‌వాల్‌ను నేను స‌ప్వీక‌రిస్తున్నాని తెలిపారు. పార్ల‌మెంట్ గైడ్‌లెన్స్ ప్ర‌కారం ఒక్క ఎంపీ ఉన్నా అవిశ్వాస తీర్మానం పెట్ట‌వ‌చ్చిన సూచించారు. మీరు అవిశ్వా తీర్మానం పెట్టండి నేను అండ‌గా ఉంటాన‌ని వెల్ల‌డించారు.

వైసీపీ అవిశ్వాస‌తీర్మానం పెడితే అందరి మద్దతు వచ్చేలా తాను చేస్తానని, పార్లమెంటరీ గైడెన్స్ ప్రకారం ఒక్క ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చని తెలిపారు. అనంతరం 50 మంది ఎంపీల మద్దతు కూడగట్టొచ్చని అన్నారు. తాము కోరితే టీఆర్ఎస్ పార్టీ నేతలు, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి వారు కూడా మద్దతు తెలుపుతారని వ్యాఖ్యానించారు. వారందరూ కలిస్తే ఏకంగా 80 మంది మద్దతు సైతం వస్తుందని చెప్పారు.

తన వంతు సాయం ఏం చేయమన్నా చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. నిన్న జగన్ సవాలు విసిరారు కాబట్టి తాను సమాధానం చెబుతున్నాని అన్నారు. అఖిల పక్షాన్ని తాను ముందుకు తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. కావాలంటే కర్ణాటక, తమిళనాడు వెళతానని, అక్కడి పార్టీలతో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు. ఇది తెలుగు జాతి సమస్య అని, పార్టీ సమస్యల కాదని చెప్పుకొచ్చారు. అలాగే తాను మార్చి 4న నేను ఢిల్లీకి సైతం వస్తానని పేర్కొన్నారు.

ఒక వేల వైసీపీ భ‌య‌ప‌డి వెన‌క్కిపోతే టీడీపీకిఆ ఛాన్స్ ఉంద‌న్నారు. బాబు అవిశ్వాసం పెడ‌తారా, జ‌గ‌న్ అవిశ్వాసం పెడ‌తారాని నేను ఎదురు చూస్తున్నాన్నారు. ధైర్యం, ద‌మ్మున్న బ‌ల‌మైన నాయ‌కుడు జ‌గ‌న్ అని మీరు కేంద్రానికి ఎదురు తిర‌గండి..మేము కూడా రోడ్ల‌మీద‌కు వ‌స్తామ‌న్నారు. మ‌రి ప‌వ‌న్ రియాక్స‌న్‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎలా స్పందిస్తార‌నేది ఉత్కంఠంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -