Monday, May 6, 2024
- Advertisement -

రాజీనామాకు రెడీ అన్న విజయసాయి….. టిడిపి అందుకు సిద్ధమా?

- Advertisement -

వైకాపా లోక్ సభ ఎంపిలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవీ త్యాగం చేసిన వైకాపా ఎంపిలను అభినందించే సంస్కారం బాబుకు లేదు. ఇక వైకాపా ఎంపిల నిరాహారదీక్షను కూడా ఎద్దేవా చేస్తూ ఉంటాడు బాబు. అలాగే వైకాపా రాజ్యసభ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదు అని బాబుతో సహా టిడిపి నాయకులు అందరూ వైకాపాని విమర్శిస్తూ ఉంటారు. అసలు టిడిపి లోక్‌సభ ఎంపిలు కూడా రాజీనామా చేయలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. అయితేనేం వైకాపా ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.

జగన్ తరపున విజయసాయిరెడ్డి డైరెక్ట్‌గా చంద్రబాబుకే ఛాలెంజ్ విసిరాడు. వైకాపా రాజ్యసభ ఎంపిలం కూడా రాజీనామా చేయడానికి రెడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కంటే పదవులు ముఖ్యం కాదు. కానీ టిడిపి లోక్ సభ, రాజ్యసభ ఎంపిలు కూడా రాజీనామాలకు సిద్ధమా? చేతకాని, చేవ చచ్చిన మాటలొద్దు……కాలయాపన చేసే కబుర్లు కాదు. ధైర్యం ఉంటే స్ట్రెయిట్‌గా చెప్పండి. టిడిపి లోక్‌సభ, రాజ్యసభ ఎంపిల చేత రాజీనామా చేయించే ధైర్యం బాబు చేయగలడా? ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పదవీ త్యాగం చేయగలరా? టిడిపి అందుకు సిద్ధమైతే ఇప్పటికిప్పుడు రాజ్యసభ ఎంపి పదవులకు కూడా రాజీనామా చేయడానికి కూడా మేం రెడీ అని విజయసాయి చాలా స్పష్టంగా చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరాడు. ఐదుకోట్ల ఆంధ్రప్రదేశ్ కోసం ఏదేదో చేస్తానని చెప్తున్న చంద్రబాబు……. కనీసం టిడిపి ఎంపిల చేత కూడా రాజీనామా చేయించలేడా? నాలుగేళ్ళుగా రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటూ……బిజెపితో బంధం కొనసాగించి అన్ని ప్రయోజనాలు పొందీ ఇప్పుడు ఎన్నికల సంవత్సరాల ఓట్ల కోసం పోరాటకం డ్రామాలు నడిపిస్తున్న చంద్రబాబుకు నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత ఉందా? అని వైకాపా ఎంపిలు ప్రశ్నిస్తున్నారు. టిడిపి లోక్ సభ ఎంపిలు, రాజ్యసభ ఎంపిలు రాజీనామా చేయడానికి రెడీ అంటే వైకాపా ఎంపిలు అందరం రాజీనామా చేయడానికి రెడీ అన్న విజయసాయి వ్యాఖ్యలను అయితే హోదా ఉద్యమకారులు కూడా స్వాగతిస్తున్నారు. మీడియాలో పోరాటకం డ్రామాలు, కబుర్లు కాకుండా చేతల్లో చంద్రబాబు చేవ చూపించాలని వాళ్ళు అంటున్నారు. తెలంగాణా కోసం ఎన్నో సార్లు ఎంపి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన టిఆర్ఎష్ పార్టీ నాయకుల్లాగే ఇప్పుడు చంద్రబాబుతో సహా టిడిపి నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని హోదా ఉద్యమ నాయకులు అంటున్నారు. మరి కేవలం కబుర్లతో కాలక్షేపం చేస్తున్న చంద్రబాబు……..మీడియా పోరాటకంతో రోజులు గడిపేస్తున్న చంద్రబాబు……స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాడా? ఎంపిల రాజీనామాలకు సిద్ధపడతాడా? లోక్ సభ, రాజ్య సభ ఎంపిలు అందరూ రాజీనామా చేస్తే కేంద్రప్రభుత్వంపై జాతీయ స్థాయిలో తీవ్రస్థాయి ఒత్తిడి వస్తుందనడంలో సందేహం లేదు అని రాజ్యాంగ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు విజయసాయితో సహా వైకాపా ఎంపిలు అందరూ రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు. మరి చంద్రబాబు కూడా చిత్తశుద్ధి చూపిస్తాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పదవీ త్యాగాలకు సిద్ధపడతారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -