Friday, May 17, 2024
- Advertisement -

నిప్పు మాత్ర‌మే ఢిల్లీకి వ‌చ్చింది… ప‌ప్పు నాయుడు వ‌చ్చాడో లేదో తెలియ‌దు….

- Advertisement -

చంద్ర‌బాబు,లోకేష్‌ల‌ను ఉతికి ఆరేశారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి . ప్ర‌త్యేక‌హోదా అవ‌స‌రంలేద‌ని చెప్పిన నిప్పు బాబు 30వ సారి ఢిల్లీకి రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌న్నారు. ఢిల్లీకి వ‌చ్చిన బాబు ప్ర‌త్యేక‌హోదాపై మ‌రో సారి యూట‌ర్న్ తీసుకుంటారేమోన‌ని భ‌యంగా ఉంద‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల చేతులు ప‌ట్టుకొని బ్ర‌తిమ‌లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. కాళ్లు ప‌ట్టుకోవ‌డం ఒక్క‌టే త‌క్కువ‌ని అది కూడా ఎవ‌రైనా పోటోలు తీస్తారనే భ‌యంతో ప‌ట్టుకోలేద‌న్నారు.

విజయసాయి రెడ్డి బీజేపీ ఎంపీయా అని పప్పు నాయుడు అడిగారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. తనకు జగన్ బీఫాం ఇస్తే వైసీపీ నుంచి గెలిచానని, తనకు చిత్తశుద్ధి ఉందని చెప్పారు. ఆర్థిక నేరస్తుడికి పీఎంవో ఏం పని అని లోకేష్ ప్రశ్నిస్తున్నారని, కానీ రేపో మాపో జైలుకు వెళ్లే వ్యక్తి పప్పు నాయుడు తండ్రి అని మండిపడ్డారు. సంస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. తాను ఎప్పటికీ వైయస్ మనిషినే అన్నారు.

పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. బాబు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప‌ప్పునాయుడి గారికి అన్యాయం, అక్ర‌మం,అవినీతి అనే మూడు ఫోర్ట్ ఫోలియోలు ఇచ్చార‌ని ఎద్దేవ చేశారు.

బీజేపీ నాయకులతో తనకు లోపాయికారి ఒప్పందం ఉందా అని పప్పు నాయుడు ప్రశ్నించారని, కానీ నిప్పుగారికి, పప్పుగారికి మాత్రమే ఆ లోపాయికారి ఒప్పందం ఉంటుందని, వైసీపీకి, తనకు ఉండదని పప్పునాయుడు గుర్తించాలని విజయసాయి అన్నారు. మీకు సిగ్గు, ఎగ్గు ఉంటే, మీ దేహంలో చీము నెత్తురు ఉంటే ఈ నాలుగేళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం అనుభవించి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటారా అని దుయ్యబట్టారు. నిజంగా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైసీపీలా మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేవారన్నారు.

అవినీతి, బంధుప్రీతి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని భూములు, ఇసుక దందా, దేవాలయ భూములు, పట్టిసీమ, సెక్స్‌ రాకెట్‌ వంటి పది అంశాల్లో చంద్రబాబుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చంద్రబాబు లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

టీడీపీ చిత్తశుద్ధి లేని పార్టీ అన్నారు . మా పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారు. మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన బీఫామ్‌తో నేను రాజ్యసభ సభ్యుడిని అయ్యాను. నేను అలా అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నేను ఎప్పటికీ వైఎస్‌ కుటుంబం మనిషినే’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -