Saturday, April 20, 2024
- Advertisement -

నంద్యాలలో ఇంటింటికి ప్రచారం…

- Advertisement -

ఇంటింటికి ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈనెలాఖరుకు నోటిఫికేషన్ రావచ్చని అనుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చేస్తే భారీ ప్రచారం సాధ్యం కాదుకాబట్టి ఈలొగానే నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టి రావలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనబడుతోంది.

అందులో భాగంగానే నంద్యాల నియోజకవర్గంలో కీలకమైన నంద్యాల మున్సిపాలిటీతో ప్రచారాన్ని ఆరంబిస్తున్నారు. ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేయాలని కోరనున్నారు.ఇప్పటి గ్రౌండ్ రిపోర్టును బట్టి పరిస్ధితులు వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని అనిపిస్తోంది. ఎందుకంటే, శిల్పా ఎక్కడ ప్రచారం చేసినా పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు జనాలు.

ఫిరాయింపు రాజకీయాలను నంద్యాల జనాలు పెద్దగా ఆధరిస్తున్నట్లు కనబడటంలేదు. ఎందుకంటే, టిడిపి అభ్యర్ధి భూమాబ్రహ్మానందరెడ్డి ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా జనాలు పెద్దగా ఆశక్తి చూపటం లేదు. నంద్యాలలో వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డి తర్వాత టిడిపిలోకి ఫిరాయించటాన్ని జనాలు అంగీకరించలేదు. దాంతో ఫిరాయింపులన్నది టిడిపికి పెద్ద సమస్యగా మారింది.

జగన్ కూడా ఇప్పటికే పలుమార్లు ఫిరాయింపుల చేత రాజీనామాల‌ విషయాన్ని జగన్ తన ప్రచారంలో ప్రస్తావించనున్నారు. దానికితోడు నలుగురు ఫిరాయింపు మంత్రులకు కోర్టు కూడా నోటీసులు జారీ చేయటమన్నది టిడిపికి బాగా ఇబ్బందవుతోంది.

ఫిరాయింపులపై తన డిమాండును, చంద్రబాబు వైఖరిని, కోర్టునోటీసులను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. జగన్ తన ప్రచారం ద్వారా శిల్పాకు మంచి ఊపు తేనున్నారని వైసీపీ శ్రేణులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -