Saturday, April 20, 2024
- Advertisement -

మూడు రోజుల్లో పార్టీ, ప్ర‌భుత్వం స్పందించ‌కుంటే ప‌ద‌వికి రాజీనామా చేస్తా..

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో జ‌నంలో దూసుకుపోతుంటే..మ‌రో ప‌క్క పార్టీలో అసంతృప్తి బ‌య‌ట ప‌డుతోంది. దీంతో పార్టీలో గంద‌ర‌గోలం నెల‌కొంది. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో జిల్లా రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజ‌న్న‌దొర త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. సాలూరు మండలం కరాసువలసలో గత 15 రోజుల్లో 9 మంది విషజ్వరాలతో చనిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై రాజ‌న్న‌దొర ఘాటుగా స్పందించారు. నిపై వైసీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు గానీ, ప్ర‌భుత్వం గాని స్పందించ‌క‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యారు. మరణాల గురించి పట్టించుకోకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

ఇలా అనారోగ్యంతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లు వ్యవమరించడం పై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇవి అనారోగ్యం కారణంగా సంభవించిన మరణాలు కావని ప్రభుత్వం చేసిన హత్యలేనని రాజన్న దొర పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -