Thursday, May 9, 2024
- Advertisement -

పోల‌వ‌రం అంశంపై అనుస‌రించాల్సిన తీరుపై చ‌ర్చ‌లు

- Advertisement -

పోల‌వ‌రంఅంశం TDP -BJP మ‌ధ్య గ్యాప్ ను పెంచుతోంది. పోల‌వ‌రం పై ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను BJP నేత‌లు త‌ప్పు బ‌డుతున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును BJP MLC సోము వీర్రాజు తీవ్రంగా తప్పు బట్టారు. ప్ర‌స్తుతం మిత్ర ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదిరి పాకాన ప‌డుతోంది. ప్ర‌స్తుతం ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పోల‌వ‌రంపై అగ్గి రాజుకుంటోన్న నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఈ అంశంపై చ‌ర్చించేందుకు భేటీ అయ్యారు. హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లోని త‌మ‌ కార్యాల‌యంలో వైసీపీ నేత‌లు విజ‌య‌ సాయిరెడ్డి, ధ‌ర్మాన ప్ర‌సాద రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర ముఖ్య‌నేత‌లు ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఊహించ‌ని రీతిలో వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో పోల‌వ‌రంపై త‌మ‌ పార్టీ అనుస‌రించాల్సిన వైఖ‌రిపై వైసీపీ చ‌ర్చిస్తోంది.

ఈనెల 15 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యోక‌హోదా, పోల‌వ‌రం, రైల్వే జోన్‌, విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న ఇత‌ర హామీల‌పై ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే దానిపై స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. ప్ర‌ధానంగా ఏపీకీ ప్ర‌త్యేక హోదాపైనే ఎక్కువ‌గా చ‌ర్చించ‌నున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇదే ఇష్యూ ప్ర‌ధానం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -