Friday, April 26, 2024
- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకీ బిగ్ షాక్‌…

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకీ ఈ వార్త అతి పెద్ద బిగ్ షాక్ అనే చెప్పాలి. గ‌తంలో అనేక స‌ర్వేలల్లో ఏపీలో వైసీపీ అధిక‌శాతం సీట్లు గెలుచుకుంటుంద‌ని ఫ‌లితాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌డు తాజాగా దేశంలో అతిపెద్ద‌దైన సీపీఎస్ త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ ఏపీ రాజకీయ పరిస్థితి పై చేసిన సర్వే ఇప్పుడు అస‌క్తిక‌రంగా మారింది. రాజకీయ పరిస్థితిపై కూలంకషంగా చేసిన ఈ అధ్యయనం ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని కొన‌సాగిస్తుంద‌ని తెలిపింది.

సమాజంలోని వివిధ విభిన్న వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుని తాము ఈ అధ్యయనాన్ని చేపట్టినట్టుగా సీపీఎస్ ప్రకటించింది.దేశంలోనే అతి పెద్ద సర్వే ఏకంగా 4,37,642 శాంపిల్స్ ను తీసుకున్నారు. పాతిక శాతం మంది కార్మికుల, ఇరవై ఒక్క శాతం రైతుల, వ్యాపారస్తుల అభిప్రాయాలు ఇరవై శాతం,గృహిణుల అభిప్రాయాలు ఏడు శాతం, ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయాలు ఏడు శాతం, విద్యార్థుల ఆరు శాతం, నిరుద్యోగుల నుంచి నాలుగు శాతం… ఇతరుల నుంచి మిగిలిన శాతాల అభిప్రాయాలు తీసుకుని ఈ సర్వే చేసిన‌ట్లుగా తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ మధ్యన చేసిన ఈ అధ్యయనం లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భంజ‌నాన్ని కొన‌సాగుతుంద‌ని తెలిపింది. ఈ స‌ర్వే అంచ‌నా ప్ర‌కారం వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ 122 ఎమ్మెల్యే సీట్లు, టీడీపీ 53 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే స‌ర్వే ద‌రిదాపుల్లో జ‌న‌సేన లేదంటే ఆ పార్టీ ఎలాంటి ఘోర ప‌రిస్థితుల్లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఓట్ల శాతం నంబర్లు :

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ –47.8

టీడీపీ-43.3

జనసేన-4.6

బీజేపీ-1.9

కాంగ్రెస్-1.7

సీపీఐ-0.3

సీపీఎం-0.2

ఇతరులు-0.2

సీట్ల నంబర్లు :

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -122

తెలుగుదేశం పార్టీ -53

జనసేన- 00

కాంగ్రెస్-00 బీజేపీ-00 ఇతరులు-00

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -