Friday, May 3, 2024
- Advertisement -

అడల్ట్ మూవీస్.. ఏం సందేశం ఇస్తున్నారు ?

- Advertisement -

కాలం మారే కొద్ది సినిమాలు కూడా మారుతున్నాయి. చూసే జనం కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. అయితే రొటిన్ సినిమాలు ఇప్పుడు ఆడటం మాత్రం చాలా తక్కువే. రొటిన్ సినిమాలు వస్తే రెండో షోకే థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. సో దర్శకులు.. హీరోలు కూడా ఎప్పటికప్పుడు కొత్తదనంవైపు పరుగులు పెడుతున్నారు. ఇలాంటి క్రమంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వీటిలో మంచి కంటెంట్.. రొమాన్స్.. కామెడీ జోడించి తీసే సినిమాలకు మంచి గీరాకి ఉంది. ఉదహారణకు తీసుకుంటే అర్జున్ రెడ్డి సినిమా. ఇది చాలా చిన్న సినిమా. అప్పటికే కేవలం ఒకే ఒక్క సినిమా తీశాడు విజయ్ దేవరకొండ.

సందీప్ రెడ్డి కూడా ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు మూడు నుంచి ఐదు కోట్ల మధ్య ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమా హిట్ అయి.. మంచి కలెక్షన్స్ ను రాబట్టాయి. ఎందుకంటే సినిమాలో దమ్ము ఉంది కాబట్టి. కథ ఉంది.. అవసరంకు కావాల్సినంత రొమాన్స్ ఉంది.. కామెడీ ఉంది.. మంచి ఎమోషన్ ఉంది. అందుకే ఈ సినిమాని జనం ఇంతపెద్ద హిట్ చేశారు. సో అన్ని కుదిరితే మంచి హిట్ అవుతాయి. అలాంటి సినిమాలను జనాలు ఆదరిస్తారు. అలానే కంచరపాలెం, ఆర్ ఎక్స్ 100 వంటి సినిమాలు కూడా ఈ కోవకు చెందినవే.

అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమాలను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. కేవలం రొమాన్సే అడ్డాగా పెట్టుకుని చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ’చీకటి గదిలో చితక్కొటుడ’ ఈ సినిమా మొత్తం బూతు కంటెంట్ తో నింపేశారు. బూతు డైలాగ్స్ తప్ప మరోకటి ఈ సినిమాలో కనిపించవు.”కొత్తగా మా ప్రయాణం” ఈ సినిమాలో రొమాన్స్ తప్ప మరొకటి ఉండదు. ‘4 లెటర్స్’ పక్కా బోల్డ్ అడల్ట్ కంటెంట్‌తో యూత్‌ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీశారు. నేను లేను ఈ సినిమాలో రొమాన్స్ లేని సీన్ లేదు. ఏడు చేపల కథ, రొమాంటిక్ క్రిమినల్స్, వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి, రాయలసీమ లవ్‌స్టోరి, RDX లవ్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి.

ఈ సినిమాల వల్ల జనాలకు వచ్చేది లేదు. యూత్ పాడవడటం తప్ప. ఏదైన కొత్త విషయం చెబుతున్నారా అంటే అది కూడా లేదు. కేవలం యూత్ ని టార్గెట్ చేసి సినిమా మొత్తం రొమాన్స్ ని నింపేసి నాలుగు డబ్బు సంపాధించాలనే తొవలో వెళ్తున్నారు. ఎలాగో సినిమా తీస్తున్నారు. సో మంచి కంటెంట్ తో అర్జున్ రెడ్డి, కంచెరపాలం లాంటి సినిమాలు తీస్తే కనీసం గుర్తింపు వస్తుంది. ఇప్పటికైన చేసే సినిమాలో కాస్త కంటెంట్ ఉండేలా సినిమాలు తీస్తే బేటర్. జనాలు కూడా ఈ సినిమా ట్రైలర్స్.. సాంగ్స్ చూసి దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి సినిమాలను బిగ్రేడ్ తో పోలుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -