Friday, April 26, 2024
- Advertisement -

సిబిఐ….ఈడీ……ఇంకా ఇతర వ్యవస్థలన్నీ కూడా రాజకీయ కక్ష్య సాధింపుల కోసమేనా?

- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన రాజ్యాంగం కూడా చాలా పెద్దదే. చదువుకునే ఏజ్‌లో బుక్‌లో చదివేటప్పుడు రూల్స్ అన్నీ చాలా స్పష్టంగా ఉంటాయి. గొప్పగా అనిపిస్తాయి. కానీ ఒకసారి మన నాయకులను, పాలనను చూడడం మొదలెట్టాక మాత్రం అంతా డొల్లే అని అనిపిస్తోంది. అన్నింటికంటే న్యాయ వ్యవస్థను గొప్పగా చెప్తూ ఉంటారు. న్యాయ వ్యవస్థను విమర్శించే విషయంలో కూడా చాలా కఠిన నిబంధనలున్నాయి. కానీ ఆ వ్యవస్థ పనితీరు మాత్రం నానాటికీ దిగజారుతూనే ఉంది. వంద కోట్లమంది భారతీయులను వెక్కిరిస్తున్నట్టుగానే ఉంటున్నాయి. ఇక ఇతర వ్యవస్థల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సిబిఐ, ఈడీలాంటి వ్యవస్థలకు అయితే కనీస స్థాయిలో కూడా విశ్వసనీయత లేదు. ఆయా సంస్థల్లోని ఉద్యోగస్థులే చాలా పెద్ద పెద్ద అవినీతి వ్యవహారాల్లో బుక్ అయి ఉన్నారు.

ఢిల్లీ పెద్దలకు సాగిలపడితే, ఢిల్లీ పెద్దల కరుణ ఉంటే ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికినా కూడా కేసులు ఉండవు. ఆ ఉన్న కేసులు నిలబడవు. ప్రబల సాక్ష్యం 2జి స్పెక్ట్రమ్ కేసే. ఇక మన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎస్కేప్ అవడానికి కూడా కారణం అదే. ‘బ్రీఫ్డ్ మీ’ అన్న వాయిస్ మీదా? కాదా? అని నేషనల్ మీడియా నిలదీస్తే యస్ ఆర్ నో చెప్పే ధైర్యం చేయలేకపోయాడు చంద్రబాబు. ఆయన మాట్లాడి ఉండకపోతే కచ్చితంగా నో చెప్పేవాడు. అలా చెప్పలేదంటే కచ్చితంగా చంద్రబాబు మాట్లాడాడని ఎవరికైనా అర్థం అయిపోతుంది. అడ్డంగా దొరికితేనేం ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టేస్తూ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని నిధుల విషయంలో పూర్తిగా మోడీ దగ్గర సాగిలపడిపోయాడు. తనకు సమస్య లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు డిఎంకే నేతలు కూడా మోడీతో ఏం ఒప్పందానికి వచ్చారో తెలియదు. ‘రాముడు దేవుడే కాదు’ అన్నది కరుణానిధి సిద్ధాంతం. ఆ విషయాన్ని ఆయన చాలా సార్లు చెప్పాడు కూడా. అయితేనేం రామ మందిరం నినాదం చెప్పుకుని ఓట్లు కొల్లగొట్టే బిజెపికి 2019లో కరుణానిధి సీట్లు అవసరమయ్యాయి. అందుకే కరుణానిధి ఇంటికి వెళ్ళి మరీ మోడీ చర్చలు జరిపాడు. ఢిల్లీలో తన ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కరుణానిధిని కోరాడు. 2జి స్పెక్ట్రమ్ కేసులో కరుణానిధి కూతురితో సహా కరుణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిర్దోషులయ్యారు. ఇప్పుడు వైకాపా నాయకులు, జనాలు కూడా జగన్ గురించి ఆలోచిస్తూ ఒక వ్యాఖ్య చేస్తున్నారు. జగన్ కూడా సోనియాను ఎదిరించకుండా ఉండి ఉంటే కేసులేమీ లేకుండా ఉండేవి……అని అంటున్నారు. 2జి స్పెక్ట్రమ్ కేసులో తీర్పు చూసిన తర్వాత టిడిపి నేతలు, ఆ పార్టీ భజన మీడియా కూడా ఈ వాదనను ఖండించలేదేమో. ఒకవేళ వాళ్ళు కాదన్నా నమ్మే జనాలు ఉంటారా? మొత్తానికి ఢిల్లీ పెద్దల నియంతృత్వంలో సాగిలపడ్డ నాయకులందరిపైనా……వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా …..ఎలాంటి కేసులూ ఉండవని మరోసారి నిరూపితమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -