Friday, May 3, 2024
- Advertisement -

2014 కుల సమీకరణాలన్నీ ఇప్పుడు టిడిపికి శతృవర్గాలేనా?

- Advertisement -

పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు అన్ని కులాల జనాలకు, అన్ని వయసుల వాళ్ళకూ, అన్ని వృత్తుల వాళ్ళకూ అన్నీ వరాలే ప్రకటించారు. కానీ మాటలు చెప్పినంత తేలిక కాదు……. మాట నిలబెట్టుకోవడం. ఉచిత విద్యుత్ ఫైలుపై వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటి సంతకం చేసి ఆ మొదటి సంతకానికి విశ్వసనీయత తీసుకొచ్చాడు. అయితే చంద్రబాబు మాత్రం ఆ మొదటి సంతకానికి ఉన్న విశ్వసనీయతను వాడేసుకుని రైతు రుణమాఫీ హామీ ఫైలుపైనే తొలిసంతకం అని నమ్మబలికాడు. ఆ తర్వాత రైతు రుణమాఫీ హామీ అమలు కోసం ఓ కమిటీ వేస్తున్నానని చెప్పేసరికి రైతులతో పాటు సామాన్యులు కూడా షాక్ అయ్యారు.

ఇక ఆ తర్వాత నుంచీ అన్ని వర్గాల ప్రజలకూ షాకులు ఇస్తూనే ఉన్నాడు చంద్రబాబు. డ్వాక్రా రుణమాఫీ అంటూ ఆంధ్రప్రదేశ్ మహిళలను కూడా అడ్డంగా మోసం చేశాడు. అలానే కాపు రిజర్వేషన్స్ అంటూ కాపులను మోసగించిన వైనం చూసి గోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు కట్టబెట్టిన కాపు ఓటర్లు ఇప్పుడు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ దూరమయ్యాక చంద్రబాబును పూర్తిగా దూరం పెట్టేశారు కాపులు. ఇక టిటిడి దేవస్థానంలో అక్రమాల పుణ్యమాని బ్రాహ్మణులు కూడా ఇప్పుడు చంద్రబాబుకు శతృవులు అయ్యారు. తాజాగా అదే బాటలో క్షత్రియులు కూడా నడుస్తున్నారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో రాజులు అందరూ కూడా టిడిపికి మద్దతిచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం తన కేబినెట్‌లో ఒక్క రాజుకు కూడా స్థానం కల్పించలేదు. అలాగే కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఇప్పుడు బిజెపిలో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా రాజు కులస్థులు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో ఒక్క మంత్రి పదవిలేదు, కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా రాజులకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇంకా టిడిపితో ఎందుకు ఉండాలి అని టిడిపి నాయకులు అయిన రాజులను ఇతర రాజులు ప్రశ్నించారు. చంద్రబాబుతో మాట్లాడి న్యాయం చేస్తామన్న టిడిపి నేతలపై రాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ళుగా ఏమీ చెయ్యని వాళ్ళు……ఇప్పుడిక ఎన్నికల ఏడాదిలో ఏం చేస్తారు…..రాజులందరూ కూడా చంద్రబాబు మాటలను నమ్మి పూర్తిగ టిడిపికి మద్దతు పలికినందుకు ఎప్పటికీ మర్చిపోలేని స్థాయిలో బుద్ది చెప్పారని మరోసారి టిడిపిని నమ్మే ప్రసక్తే లేదని రాజులందరూ ఆవేశంగా స్పందించడంతో టిడిపి నేతల నోట మాట రాలేదు. అయితే రాజుల ఆగ్రహం నేపథ్యంలో చంద్రబాబు చేత ఏవో కొన్ని హామీలయినా ఇప్పించాలని ఇప్పుడు టిడిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -