Saturday, April 27, 2024
- Advertisement -

బీజేపీతో పొత్తు ఫలిస్తుందా?

- Advertisement -

చంద్రబాబు,టీడీపీ అంటేనే పొత్తు రాజకీయం. ఎన్నికలు ఏవైనా పొత్తు ఉండాల్సిందే. ఓసారి కమ్యూనిస్టులు, మరోసారి బీజేపీ ఇలా ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందురు రెడీ అవుతారు చంద్రబాబు.ఇక 2019లో బీజేపీని తిట్టని తిట్టు లేదు. కానీ తీరా 2024 వచ్చేసరికి అదే బీజేపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల రణరంగలో దిగారు.

ఎక్కువ సంద‌ర్భాల్లోచంద్రబాబు పొత్తు పెట్టుకుంది మాత్రం బీజేపీతోనే. 1999, 2004, 2014ల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. మ‌ర‌లా 2018లో ఆ పార్టీతో విభేదించి 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా వెళ్ళి బొక్క‌బోర్లా ప‌డ్డాడు. ఇప్పుడు మ‌రోసారి ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల కాళ్ళావేళ్ళా పడి పొత్తుకు ఒప్పించుకున్నాడు. కానీ వాస్త‌వ ప‌రిస్థితులు చూస్తే టీడీపీతో పొత్తు ఆర్ఎస్ఎస్ పెద్ద‌ల‌కు ఇష్టం లేదు.

టీడీపీతో పొత్తు ఏపీలోని కిందిస్థాయి బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఇష్టం లేదు. 2018లో ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వెళ్ళిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను వారు ఇంకా మ‌ర్చిపోలేకున్నారు. వీట‌న్నింటికీ మించి పొత్తు కుదిరిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ సోష‌ల్‌మీడియాలో టీడీపీ అభిమానులు ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాల‌పై కామెంట్లు చేస్తున్నారు. అందుకు దీటుగా బ‌దులిస్తున్నారు బీజేపీ అభిమానులు.

దీనిని బ‌ట్టీ చూస్తే కిందిస్థాయిలో టీడీపీ, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు ఏపీలో ఎన్డీయే కూట‌మిని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పెద్ద‌ల‌తో మాట‌లు పడ్డాన‌ని, ఈ పొత్తు నా వ‌ల్లే కుదిరింద‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటున్నాడు.దీంతో ఈ పొత్తు కుదిర్చిన విష‌యంలో అత‌నిపై కూడా టీడీపీ అభిమానులు సోష‌ల్‌మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్న వ‌ధూవ‌రుల కాపురం ఎలా సాగుతుందో నేడు ఏపీలో ఎన్డీయే ప్ర‌యాణం కూడా అలాగే సాగుతోంద‌ని ప‌లువురు వెట‌కారం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -