Saturday, April 20, 2024
- Advertisement -

దుమ్మురేప‌నున్న సినీ గ్లామ‌ర్‌…

- Advertisement -

ఆలూలేదు… సూలులేదు కొడుకు పేరు సొమ‌లింగం అన్న సామెత‌లాగా ఉంది ఏపీలో రాజ‌కీయ పార్టీల పరిస్థితి.2019 ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉన్నా ఎన్నిక‌ల‌ హ‌డావుడి ఇప్పుడే మొద‌ల‌య్యింది.అన్ని పార్టీలు ఇప్ప‌టినుంచే అస్త్ర‌శ‌స్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి.గెలుపు గుర్రాల‌పై వేట‌ను ప్రారంభించాయి.ఇక ప్ర‌ధానంగా సినిగ్లామ‌ర్‌మీద‌నే ఎక్కువ దృష్టి సారించారు.
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ జ‌న‌సేన పార్టీని స్థాపించారు. మొద‌ట్లో భాజాపా-టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేక‌హోదాపై రెండు పార్టీలు న్యూట‌ర్న్ చేయ‌డంతో అప్ప‌టినుంచి ప‌వ‌ణ్ అంటి ముట్ట‌న‌ట్లుగా ఉంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.
ప‌వ‌ణ్‌కూడా అబ్య‌ర్తుల‌వేటను మొద‌లు పెట్టారు.వ‌ప‌ణ్ అనంత‌పురం జిల్లానుంచి పోటీ చేస్తాన‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. నాగ‌బాబు జ‌న‌సేనుంచి కాకినాడ ఎంపీగా పోటీచేయ‌నున్నారు. ఇక హీరో శివాజి గుంటూరునుంచి బ‌రిలోకి దిగ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అలీ గుంటూరు లేదా రాజ‌మండ్రినుంచి పోటీచేస్తార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సీనియ‌ర్ సినీ న‌టుడు బెన‌ర్జీకూడా జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు తెలిపారు.సినీ గ్లామ‌ర్ ఏరేంజ్‌లో ఉందో తెలుస్తోంది.
ఇక టీడీపీకి సినిమా వార‌స‌త్వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.ఎన్‌టీఆర్ పార్టీని ఏర్పాటుచేసి సీఎం అయ్యారు.ప్ర‌స్తుతం టీడీపీ త‌రుపున హిందూపురం ఎమ్మెల్యేగా బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు.జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ను రంగంలోకి దింపేందుకు పావులు క‌దుపుతున్నారు.అందుకే హ‌రికృష్ణ‌కు టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌విని ఇస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది.
వైసీపీకి ఎక్కువ‌గా సినీ గ్లామ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. రోజా మాత్ర‌మే ప్ర‌ధాన ఆక‌ర్శ‌న‌గా ఉన్నారు.అందుకే మ‌రికొంత‌మంది సినీ స్టార్స్‌మీద దృష్టిసారించింది. అందుకే మ‌న్మ‌ధుడు నాగార్జున‌మీద పోక‌స్ చేశారు.వ‌చ్చె ఎన్నిక‌ల్లోవైసీపీనుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. మంచు ల‌క్ష్మీకూడా చిత్తూరు జిల్లానుంచి ఏదోక నియేజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే సాదార‌న ఎన్నిక‌ల్లో సినీ గ్లామ‌ర్ దుమ్మురేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -