Monday, May 6, 2024
- Advertisement -

నంది అవార్డులపై సర్వత్రా వినిపిస్తోన్న ప్రశ్నలు

- Advertisement -

నంది పురస్కారాల విషయంలో నలుగుతోన్న గొడవ… బ్లో అవుట్ మాదిరిగా నిన్న సాయంత్రంనుంచి మరింత పెరిగిపోయింది. కేవలం మెగా ఫ్యామిళీ గురించే కాకుండా మిగతా వెర్షన్లు కూడా వినిపిస్తూ ఉండడంతో అంతా బయటకు వస్తున్నారు. బన్నీవాసుతో షురూ అయిన ఈ రచ్చ… బండ్ల గణేష్ సైకిల్ అవార్డులు అనేవరకు వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ రచ్చే సర్కులేట్ అవుతోంది.

మెగా హీరోలకు అవార్డులు రాలేదనే విషయాన్ని పక్కన పెట్టి.. ఇంకా అర్హులు ఎవరెవరికి రాలేదనే విషయాలను సినీ జనాలు పరిగణలోకి తీసుకుని ఎవరికి తోచిన లెక్కలు వారు వేస్తున్నారు. ఒక్క మెగా హీరోలకే కాదు… అక్కినేని కుటుంభానికి కూడా దక్కాల్సిన అవార్డులు దక్కలేదనేది మరో వర్గం వాదన. దీనికి క్లారిటీని ప్రసన్నకుమార్ ను అడగగా…ఆయన ఆత్మలు ,గత జన్మల కాన్సెప్ట్ లను క్రైటీరియాలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్.
లెజండ్ చిత్రానికి అన్ని అవార్డులు ఇచ్చేంతగా ఉందా అసలు ఏం చూసి వీరికి వీరే ఇచ్చేసుకున్నారు అనే కొశ్చన్ కు సమాధానం చెప్పేవారు కనిపించడం లేదే.ఏం మాట్లాడితే ఏమైపోతుందోననే భయం చాలామందిని వెంటాడుతూ ఉండడంతో సైలెన్స్ ప్లీజ్ నే మెయిన్ టైన్ చేస్తున్నారనే మాటలు బయటకు వస్తున్నాయి. గుణశేఖర్ తీసిన రుద్రమదేవి పక్కా తెలుగు నేటివిటీ చిత్రమైనప్పటికీ..దానికి చాలా అన్యాయం చేశారని ఆ సినిమా దర్శకుడు గునశేఖర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. గుణ శేఖర్ డైరెక్టర్ గా కమిటీని ,ఎపి ప్రభుత్వంపై డైరెక్ట్ గా అటాక్ చేయడం చర్చనీయాంశమైంది.

అవార్డుల కమిటీకి చిన్న చిత్రాలు కనిపించడం లేదా అనేది మరో వర్గం వాదన.ఏ అవార్డులు ఇచ్చిన ఉన్న మూడు వర్గాలకే అగ్రతాంభూలం ఇస్తున్నారని . మిగతా వర్గాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు మరింత పెరిగిపోతున్నాయి. ఇక్కడ కేవలం ఇష్యూ మెగా హీరోల గురించి కాదని…మిగతా అందరి నటీనటుల గురించని సర్వత్రా చర్చనీయాంశమైంది.

బాహుబలి ది బిగినింగ్ కు అంతటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చినా.. ఆ సినిమాకు ఇంకా రావల్సిన అవార్డులు రాలేదని బహిరంగంగా అందరూ చెబుతోన్న మాట. నంది పురస్కార కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరించిన గిరిబాబు,జీవితా రాజశేఖర్ ,పోకూరి బాబురావులపై అదికార పార్టీ ఒత్తిళ్లు పనిచేశాయని కామెంట్స్ మరింత పెరిగిపోతున్నాయి. నంది అవార్డులనేవి ఓ ప్రైవేట్ సంస్థ అవార్డులు కావు. ఇవి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు. కాబట్టి….ఈ విషయంలో ఎంతో పారదక్షత ప్రదర్శించాలి. అది కొరవడింది.

కాబట్టే..ఇష్యూ ఇవ్వాల ఇంతలా రాజకీయరంగు పులుముకుంది. ఇంతకీ నంది అవార్డులు ఎంపికలో ఈ కమిటీలు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని తాము అవార్డులు ఇచ్చామో చెబితే… ఇష్యూకి ఇక్కడితో చెక్ పెట్టినట్లవుతుంది. అలా ఏమైనా కమిటీ నుంచి గాని,జ్యూరీ సభ్యులు గాని ..బయటకు వచ్చి ఏమైనా స్టేట్ మెంట్ ఇస్తారా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -