Friday, March 29, 2024
- Advertisement -

రాత్రిభోజ‌నం చేసిన త‌ర్వాత అర‌టిపండు తింటె ఏమౌతుందో తెలుసా…?

- Advertisement -

మ‌నిషి బ్ర‌త‌కాలంటె ఆహారం ముఖ్యం. ప్రీరోజు ఉద‌యం టిపిన్ ..మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ , రాత్రి మళ్లీ భోజనంతో రోజు ముగుస్తుంది. దాదాపు ఎక్కువ మంది అనుసరించే విధానం ఇదే. కానీ కొందరు తమకు నచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు, ఏదిపడితే అది ఆహారంగా తింటారు. ముఖ్యంగా పండ్లు ఎప్పుడు తీసుకోవాలో అంద‌రికి తెలియ‌దు.

నిజానికి మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎన్నో అంశాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తినే ఆహార పదార్థాల్లోని గుణాలు, పోషకాలు, కారణంగా శరీరంలో జీర్ణవ్యవస్థలో మార్పులు సంభవిస్తాయి. అంటే ఆహారం తినే విషయంలో కూడా మనం సమయాసమయాలు పాటించాలి. ఆర‌టిపండును ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడ‌దు.
పేదవాడి నుంచి సంపన్నుల వరకు అందరూ ఇష్టపడే అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు కలిగిస్తుంది. ఇది సహజసిద్ధమైన యాంటాసిడ్ గా పనిచేస్తుంది.చాలామంది భోజనం తర్వాత అరటిపండు తింటారు.

రాత్రి భోజనం తర్వాత అరటిపండు తింటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడడానికి, జలుబుకు దారితీస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిళ్ళు అరటిపండు తినకూడదు. మధ్యాహ్న సమయంలో తింటే మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అసౌకర్యానికి కారణమవుతుంది. తెలుసుకున్నారు క‌దా అర‌టిపండు ఎప్పుడు తినాలో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -