శృంగార సామర్థ్యాన్ని బాగా పెంచే ఆహారాలు..!

- Advertisement -

మానవ జీవన శైలీ రోజు రోజుకి మారుతూ వస్తుంది. ఈ క్రమంలో పనిలో ఒత్తిడి, అనరోగ్య సమస్యలు వంటి ఎన్నో ఎదురవుతున్నాయి. వీటి వల్ల ప్రస్తుత తరుణంలో స్త్రీ, పురుషుల్లో శృంగార సామర్థ్యం చాలా తగ్గిపోతుంది. కొందరికి అయితే శృంగారంపై ఆసక్తి కూడా పోతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కుంటున్న వారు కొన్ని నియమాలను పాటిస్తే పరిష్కారం ఉంటుంది. పలు వెజిటేరియన్ ఆహారాలు తీసుకోవడం వల్ల శృంగారంలో సామర్ద్యం అద్భుతంగా పెరుగుతోంది. ఆవెంటివో ఇప్పుడు చూద్దాం..

అరటి పండ్లు : ఈ పండ్లలో వింటమిన్ బి, ట్రిఫ్టోఫాన్, పొటాషియం, బ్రొమెలీన్ ఉంటాయి. అందుచేత అరటి పండ్లు తినడం వల్ల శృంగార సామార్ద్యం బాగా పేరుగుతుంది.

బీట్‌రూట్ జ్యూస్ : రోజు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్త సరఫరా బాగా పెరుగుతోంది. బీట్ రూట్ లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. అందుచేత మూడ్ మారి.. శృంగారంపై ఆసక్తి పెంచుతుంది.

ఎర్ర ద్రాక్షలు : ఎరుపు రంగు ద్రాక్షల్లో రెస్‌వెరట్రాల్, స్టిల్బెనాయిడ్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా శృంగార సామర్థ్యాన్ని అధికంగా పెంచుతాయి.

కాఫీ : కాఫీ రోజులో రెండు మూడు సార్లు తాగితే.. శృంగార సామర్థ్యం పెరుగుతోంది. కాఫీలో ఉండే సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు శృంగారం పట్ల ఆసక్తిని పెంచుతాయి.

ఇతర ఆహారాలు : నిమ్మజాతికి చెందిన పండ్లు, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, బీన్స్, ఆపిల్స్, డ్రై ఫ్రూట్స్, గుమ్మడికాయలు, మొక్కజొన్న తదితర ఆహారాల్లో విటమిన్ బి, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

Also Read: ఆ వయసులో కోరికలు ఎక్కువగా ఉండటానికి కారణం..?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -